twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మారుతి ‘రొమాన్స్’ శృతిమించిందా? (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఈ రోజుల్లో, బస్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి సినిమాలతో తనకంటే బ్రాండ్ నేమ్ ఏర్పరుచుకున్న మారుతి ఈ సారి ప్రేక్షకులపై‌కి 'రొమాన్స్' సినిమాను వదిలాడు. గుడ్ సినిమా గ్రూప్ మారుతీ మీడియా హౌస్ పతాకంపై డార్లింగ్ స్వామి దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు, ఎస్.కె. ఎన్. నిర్మించిన 'రొమాన్స్' చిత్రం ఆగస్టు 2న విడుదలకు సిద్ధమైంది. ప్రిన్స్, డింపుల్, మానస హీరో హీరోయిన్లు.

    తాజాగా ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సెన్సార్ సర్టిఫికెట్‌ను చూస్తుంటే సినిమా పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా అని స్పష్టం అయింది. టైటిల్ కు తిగిన విధంగానే సినిమాలో శృతి మించిన రొమాన్స్ ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    ప్రభాక్, నల్లవేణు, సాయి, భారవి, వెంకీ, విష్ణుప్రియ, సాయికృష్ణ, బిందు, అవినాష్, జాహ్నవి తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, కథ-మాటలు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.

    పక్కా యూత్ ఎంటర్టెనర్

    పక్కా యూత్ ఎంటర్టెనర్

    నిర్మాతలు మాట్లాడుతూ- తమ ద్వితీయ ప్రయత్నంగా ఈ చిత్రాన్ని అందరికీ నచ్చేలా రూపొందించామని, అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో, ట్రైలర్లకు మంచి ఆదరణ లభిస్తోందని, పక్కా యూత్ ఎంటర్‌టైనర్‌గా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

    దర్శకుడిగా డార్లింగ్ స్వామి

    దర్శకుడిగా డార్లింగ్ స్వామి

    డార్లింగ్ చిత్రంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన రచయిత స్వామి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి ఆయన స్వయగా కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహించబోతున్నారు. ఇవి సినిమాకు హైలెట్ కాబోతున్నాయి.

    ప్రిన్స్-డింపుల్ కెమిస్ట్రీ

    ప్రిన్స్-డింపుల్ కెమిస్ట్రీ

    రొమాన్స్ మూవీ కంప్లీట్ యూత్ ఎంటర్టెనర్. ఈ చిత్రంలో హీరో ప్రిన్స్ హీరోయిన్లు డింపుల్, మానసలతో రొమాన్స్ చేయబోతున్నాడు. ప్రిన్స్-డింపుల్ మధ్య జరిగే కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ హైలెట్ కానున్నాయి. ప్రభాకర్, నల్లవేణు, సాయి, భార్గవి, వెంకి, విష్ణుప్రియ, సాయికృష్ణ, బింధు, అవినాష్, జాహ్నవి ఇతర పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

    సాయి కార్తీక్ మ్యూజిక్

    సాయి కార్తీక్ మ్యూజిక్

    ఈ చిత్రం కోసం సాయి కార్తీక్ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. బాబా సెహగల్ పాడిన ‘పేరుకిది ప్యారేలే'పాట బాగా పాపులర్ అయింది. చాలా మంది ఫోన్లలో రొమాన్స్ మూవీ పాటలు రింగ్ టోన్ గా వినిపిస్తున్నాయి. అను అను, రాధాకృష్ణుడే లాంటి మెలొడీ సాంగులు కూడా ఆకట్టుకుంటున్నాయి.

    రొమాన్స్ ఆడియో లాంచ్

    రొమాన్స్ ఆడియో లాంచ్

    రొమాన్స్ మూవీ ఆడియో ఇటీవల విడుదలైంది. ఈ ఆడియో వేడుక కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. దీంతో సినిమా ఆడియో ఫంక్షన్‌కు మంచి స్పందన వచ్చింది.

    ప్రభాకర్ రెడ్డి పిక్చరైజేషన్

    ప్రభాకర్ రెడ్డి పిక్చరైజేషన్

    ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. ఆయన సినిమాను ఎంతో అందంగా తెరకెక్కించారని, రొమాన్స్ మూవీలోని ప్రతి ఫ్రేము ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ లా ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర యూనిట్ సభ్యులు.

    రొమాన్స్ ప్రోమోస్

    రొమాన్స్ ప్రోమోస్

    ఇప్పటికే విడుదలైన రొమాన్స్ మూవీ ట్రైలర్లు, ప్రోమోలకు మంచి స్పందన వస్తోంది. వీటిని చూసిన తర్వాత వ్యూవర్స్‌లో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా రొమాంటిక్‌గా, వినోదాత్మకంగా ఉండనుందని స్పష్టం అవుతోంది.

    రొమాన్స్ సాంకేతిక నిపుణులు

    రొమాన్స్ సాంకేతిక నిపుణులు

    ఈ చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్ మంచి ప్రతిభ కనబర్చారు. ఈ చిత్రానికి పాటలు: కాసర్ల శ్యామ్, కరుణాకర్, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్ధవ్, కెమెరా: జె.ప్రభాకర్‌రెడ్డి, సంగీతం: సాయి కార్తీక్, కథ-మాటలు- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.

    రొమాన్స్ రిలీజ్ డేట్

    రొమాన్స్ రిలీజ్ డేట్

    రొమాన్స్ మూవీ ఆగస్టు 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈచిత్రాన్ని హైదరాబాద్‌లో 50కిపైగా థియేటర్లు, నైజాం ఏరియాలో దాదాపు 150 థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    English summary
    Upcoming Telugu film Romance starring Prince, Dimple Chopade and Manasa in the leads, has recently completed its Censor formalities. The much-hyped movie has received an 'A' certificate from the Regional Censor Board with a few minor cuts.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X