Jeevitha Rajasekhar: బ్రేకింగ్.. జీవిత-రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అసలు ఏం జరిగిందంటే?

సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు రాజశేఖర్-జీవిత దంపతులు. యాంగ్రి హీరోగా రాజశేఖర్ అత్యధికంగా పాపులారిటీ సాధిస్తే.. నటిగా, దర్శకురాలిగా జీవిత గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కలిసి ఎన్నో చిత్రాలకు పని చేశారు. హీరోహీరోయిన్లుగా, బ్యూటిఫుల్ ఆన్ స్క్రీన్ కపుల్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నిజ జీవితంలో కూడా ఒక్కటయ్యారు. ఇటీవల సినిమాలకు కాస్తా దూరంగా ఉంటున్న వీరికి జైలు శిక్ష విధించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

కోర్టు తీర్పు: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అదే జీవిత, రాజశేఖర్ దంపతుల పరువు నష్టం కేసు. సినీ నటులు అయిన జీవిత-రాజశేఖర్ దంపతులకు పరువు నష్టం కేసులో జైలు శిక్ష విధిస్తూ నాంపల్లిలోని 17వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ (ఏసీఎమ్ఎమ్) కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.

 Jeevitha Rajasekhar

ఆరోపణలు:అయితే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుపై 2011 సంవత్సరంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జీవిత రాజశేఖర్ దంపతులు. దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని మార్కెట్ లో అమ్ముకుంటున్నారని ఈ దంపతులు ఆరోపణలు చేశారు. ఇందుకుగానూ నిర్మాత అల్లు అరవింద్‌ అప్పట్లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

 Jeevitha Rajasekhar

కథనాల సమర్పణ: చిరంజీవి బ్లడ్ బ్యాంకుపై జీవిత-రాజశేఖర్ దంపతులు చేసిన ఆరోపణలకు సంబంధించి మీడియాలో ప్రచురితమై కథనాలను సీడీ రూపంలో కోర్టుకు సమర్పించారు అల్లు అరవింద్. చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ పరువునష్టం దావా వేశారు.

 Jeevitha Rajasekhar

రెండేళ్లపాటు శిక్ష: జీవిత-రాజశేఖర్ పరువు నష్టం దావాపై సుదీర్ఘ విచారణ జరిపిన కోర్టు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం వారికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. జైలు శిక్షతోపాటు రూ.5 వేల జరిమానా సైతం విధించింది.

 Jeevitha Rajasekhar

బెయిల్: నాంపల్లి కోర్టు తీర్పుపై జిల్లా కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడంతో అప్పీలు కోసం అవకాశమిస్తూ జీవిత-రాజశేఖర్‌ దంపతులకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఈ దంపతులిద్దరు బెయిల్‌ బాండ్ల రూపంలో పూచీకత్తులను సమర్పించిన అనంతరం కోర్టు నుంచి విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X