హీరో పృథ్విరాజ్ దర్శకత్వంలో అమితాబ్
ముంబై : ఆ మధ్య ఉరిమి చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన మలయాళ హీరో పృథ్వీరాజ్ దర్శకుడిగా మారబోతున్నాడు. హిందీ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రను చేయించబోతున్నాడు.
ఇటీవల ఏయ్యా, ఔరంగజేబ్ లాంటి హిందీ చిత్రాల్లో నటించి బాలీవుడ్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ దర్శకుడిగా నెక్ట్స్ స్టెప్ వేయబోతున్నాడు. 2012లో తాను నటించిన మలయాళ హిట్ చిత్రం 'Ayalum Njanum Thammil' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయాలని చూస్తున్నాడు పృథ్వీ.
ఇటీవల ఓ ప్రెస్ మీట్లో పృథ్వీరాజ్ ఈ విషయం గురించి వెల్లడిస్తూ...'దర్శకుడిగా నా ప్రయత్నంలో మొదటి అడుగు పడింది. 'Ayalum Njanum Thammil' రైట్స్ తీసుకున్నాను. అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ముఖ్యమైన కీలక పాత్ర చేయబోతున్నారు' అని వెల్లడించారు.
Ayalum Njanum Thammil చిత్ర కథాంశం వైద్య వృత్తిలోని నీతికి సంబంధించిన ఓ మెడికల్ డ్రామా. అదే విధంగా ఓమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగుతుంది. నీతి వంతమైన ఓ సీనియర్ డాక్టర్, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే జూనియర్ డాక్టర్ మధ్య జరిగే స్టోరీ.


Click it and Unblock the Notifications











