twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విదేశాల్లో చిక్కుకున్న స్టార్ హీరో.. నిత్యం వైద్య పరీక్షలు.. కష్టాలు చెప్పుకుంటూ సుదీర్ఘమైన పోస్ట్

    |

    కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ బెంబేలెత్తి పోతోన్నాయి. ఇప్పటికే ఆరు లక్షలమందికిపైగా కరోనా బారిన పడగా.. వేల మంది మృత్యువాత పడ్డారు. కరోనా ఇంతలా విజృంభిస్తోన్నా.. కట్టడి మాత్రం చేయలేకపోతున్నారు. కరోనాకు విరుగుడు కనిపెట్టకపోవడమే ఇందుకు కారణం. అయితే కరోనా రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు మాత్రం పకడ్బందీగా అమలు చేస్తున్నాయి.

     ఎక్కడివారు అక్కడే..

    ఎక్కడివారు అక్కడే..

    ముఖ్యంగా ఈ కరోనా మన దేశానికి విదేశీయుదల ద్వారా సంక్రమించింది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఈ వైరస్ భారతదేశంలో వ్యాప్తి చెందింది. దీంతో విదేశీయులను అనుమతించడం ఆపేశారు. మన దేశంలోనూ రాకపోకలను నిలిపివేశారు.

    విదేశాల్లో చిక్కిన భారతీయులు..

    విదేశాల్లో చిక్కిన భారతీయులు..

    మన భారతీయులు సైతం విదేశాల్లోనే చిక్కిపోయారు. కరోనాను కట్టడి చేసేందుకు అన్ని దేశాలు లాక్ డౌన్‌ను విధిగా పాటిస్తున్నాయి. మన దేశంలోనూ విదేశీయులున్నట్టు.. మనవారు విదేశాల్లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో మలయాళం స్టార్ హీరో, మూవీ యూనిట్ అక్కడే ఇరుక్కుపోయింది.

     షూటింగ్ నిమిత్తం..

    షూటింగ్ నిమిత్తం..

    ఆడుజీవితం అనే మూవీ షూటింగ్‌లో భాగంగా పృథ్వీరాజ్, ఆయన బృందం జోర్డాన్‌కు వెళ్లారు. అయితే కరోనా వ్యాప్తి చెందడంతో షూటింగ్‌ను అనుమతి ఇవ్వలేదంట. అయితే తరువాత మళ్లీ రిక్వెస్ట్ చేయడంతో కొన్ని రోజులు పొడిగించారని తెలిపాడు. అయితే కరోనా మరింత తీవ్రతరం కావడంతో షూటింగ్ పూర్తిగా ఆపివేశామని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Prithviraj Sensational Comments On Caste Feeling In Tollywood
    నిత్యం వైద్య పరీక్షలు..

    నిత్యం వైద్య పరీక్షలు..

    అయితే ఇక్కడే ఓ హోటల్ రూమ్‌లో ఉన్నామని, తమతో పాటు ఓ వైద్యుడు కూడా ఉంటున్నాడని చెప్పుకొచ్చాడు. జోర్డాన్ వైద్యులు కూడా తమను నిరంతరం పరీక్షిస్తున్నారని తెలిపాడు. తామంతా క్షేమంగానే ఉన్నట్లు పేర్కొన్నాడు. తమకు భారతదేశానికి తిరిగి రావాలని ఉందని, అయితే పరిస్థితులు చక్కబడ్డాక వెంటనే వస్తామని వెల్లడించాడు.

    English summary
    Prithviraj Sukumaran About Lockdown And Stuck In Jordan. Aadu Jeevitham Unit Went To Jordan. But They Stuck Theie Due To Corona Epidemic.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X