నటుడు ఓంపురిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
బాలీవుడ్ నటుడు ఓంపురికి సోమవారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. పార్లమెంటుపై, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆయనకు ఈ నోటీసులు అందాయి. ఇటీవల అన్నా హజారే దీక్షా శిబిరానికి వచ్చిన ఓంపురి వేదికపై మాట్లాడుతూ ..పార్లమెంటు సభ్యల్లో చదువురాని దద్దమ్మలు, అసమర్థులు ఉన్నారంటూ తీవ్ర పదజాలంలో ఉద్వేగ భరితంగా ప్రసంగించారు.
ఓంపురి వ్యాఖ్యలపై అభ్యంతర వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి ఇద్దరు, రాజ్య సభ నుంచి ఇద్దరు లోక్‌సభ స్పీకర్‌కు, రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఓంపురితో పాటు మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీకి కూడా సభ హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. తన చేసిన వ్యాఖ్యలపై ఓంపురి ఇప్పటికే క్షమాపణలు చెప్పారు.
bollywood om puri anna hazare privilege notices parliament బాలీవుడ్ ఓంపురి అన్నా హజారే సభా హక్కుల ఉల్లంఘన పార్లమెంటు


Click it and Unblock the Notifications