సిద్దార్దకి అదొక్కటే రాదు, చాలాసార్లు తిప్పలు పడ్డాడంటోంది
సిద్ధూకి అన్నీ వచ్చు. అదే నాకు నచ్చదు. చాలా బాగా నటిస్తాడు, పాటలు పాడేస్తాడు, దర్శకత్వ విభాగం గురించి మంచి అవగాహన ఉంది. ఒక్కటేంటి...? అన్నీ చేసేస్తాడు. గుండ్రంగా సున్నా చుట్టడం ఒక్కటే రాదనుకొంటా. పాపం...చాలాసార్లు తిప్పలు పడ్డాడు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది ప్రియా ఆనంద్. లీడర్ చిత్రంతో పరిచయమైన ఈ భామ రీసెంట్ గా సిద్దార్ద సరసన '180' అనే చిత్రంలో చేస్తోంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ సిద్దార్ధ గురించి ఇలా చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో నా పాత్ర గురించి తప్ప మరే విషయాలూ నాకు తెలీవు. కథగా చెప్పాల్సి వస్తే - 'రేపటి గురించి ఆలోచించకు. ఈ క్షణమే నీది' అని చెప్పే సినిమా ఇది అంటోంది.


Click it and Unblock the Notifications











