ఎక్స్ ఫోజింగ్ లేకుండానే ‘పెటా’ కోసం ప్రియా ఆనంద్
హైదరాబాద్ : లీడర్ చిత్రం ద్వారా తెలుగులో సినిమా కెరీర్ ప్రారంభించిన ప్రియా ఆనంద్..ఆ తర్వాత 'రామ రామ కృష్ణ కృష్ణ', 180 చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె నటించిన సినిమాలేవీ భారీ విజయాలు సాధించక పోవడంతో అమ్మడుకి పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి.
ఓ వైపు అడపాదడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ...మరో వైపు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ప్రియా ఆనంద్ జంతు సంరక్షణ సంస్థ 'పెటా' కోసం ప్రాచారం ప్రారంభించింది. జంతువులు, పక్షులు మనలాంటి జీవులే. వాటిని హింసించొద్దు, బంధించి ఉంచవద్దు, వాటిని స్వేచ్చగా తిరగనివ్వండి అంటూ ప్రచారం చేస్తుంది.
సాధారణంగా 'పెటా' కోసం ప్రచారం అనగానే ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం బట్టలూడదీసి నగ్నంగా ఫోజులు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు. అయితే తొలి నుంచి ఎక్స్ ఫోజింగుకు దూరంగా ఉంటున్న ప్రియా ఆనంద్...'పెటా' కోసం కూడా తన పాలసీ మార్చుకోకుండా ఎక్స్ ఫోజింగుకు దూరంగానే ఉంది.
ప్రస్తుతం ప్రియా ఆనంద్ తెలుగులో 'కో అంటే కోటి' అనే చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తమిళంలో ఓ సినిమా, హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇటీవల ఆమె నటించిన 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ప్రియా ఆనంద్ కు బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చింది.


Click it and Unblock the Notifications












