సిద్ధార్థతో ఎఫైర్ లేదంటున్న ప్రియా ఆనంద్
హైదారాబాద్: సిద్ధార్థ, ప్రియా ఆనంద్ జంటగా 180 చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనేపథ్యంలో హీరోయిన్ ప్రియా ఆనంద్ స్పందించింది. శ్రీదేవి రీఎంట్రీ మూవీ 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రంలో నటించిన ప్రియా...ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది.
తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని, మేము మంచి మిత్రులం మాత్రమే...లేని పోని వార్తలు సృష్టించి తమను ఇబ్బంది పెట్టవద్దని మీడియాను వేడుకుంది. 180 చిత్రం తర్వాత చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సిద్దార్థను కలిశానని, ఈ మధ్య అతన్ని కలవక చాలా రోజులైందని, తమ మధ్య ఎఫైర్ సృష్టించి స్నేహాన్ని అపహాస్యం చేయవద్దని కోరింది.
ప్రస్తుతం తాను 'ఇంగ్లీష్ వింగ్లిష్' చిత్రం ప్రమోషన్లో చాలా బిజీగా గడుపుతున్నానని...ఈచిత్రంలో తన అభిమాన నటి శ్రీదేవితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని ప్రియా చెప్పుకొచ్చింది. ఇందులో తన పాత్రకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది.
ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రంలో శ్రీదేవి, ఆదిల్ హుస్సేన్, ప్రియా ఆనంద్, మెహిదీ నెబ్బో నటిస్తున్నారు. సంగీతం: అమిత్ త్రివేది, సౌండ్: రసూల్ పూకుట్టి, ఫోటో గ్రఫీ: లక్ష్మణ్ ఉటేకర్, ఎడిటింగ్: హేమంతి సర్కార్, నిర్మాతలు: రాకేష్ జుంజుంవాలా, ఆర్.దమని, సునీల్ లుల్లా, ఆర్. బాల్కీ, రచన-దర్శకత్వం: గౌరీ షిండే.


Click it and Unblock the Notifications











