ఎన్టీఆర్ ఎవరో తెలియదు అనుండాల్సింది...!?మరింత పబ్లిసిటీ దొరికేది...!?
ప్రభాస్ ఎవరో తెలీదని అనడం ద్వారా నిత్యామీనన్ ఇప్పుడు చాలా పాపులర్ అయింది. అలా మొదలయింది చూడని వారికి కూడా ఇప్పుడు నిత్యామీనన్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. అంతకు మించి శనివారం విడుదల కాబోతున్న 180 చిత్రంలో హీరోయిన్ నిత్యా మీనన్ అనే సంగతి బాగా ప్రచారంమయింది. ఇదే ప్రెస్ మీట్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన ఈ చిత్రంలోని మరో హీరోయిన్ ప్రియా ఆనంద్ కంటే నిత్యకే మైలేజ్ ఎక్కువ లభిస్తోంది.
ఇద్దరి హీరోయిన్స్ వీ సమానమైన పాత్రలని చెప్పుకుంటున్నా కానీ నిత్యకి మొత్తం ఎటెన్షన్ దక్కడం 'లీడర్" పిల్లని ఇబ్బంది పెడుతోంది. లీడర్ సినిమాకి కూడా రిచాగంగోపాధ్యాయ హైలైట్ అయితే ఇప్పుడీ సినిమాకి నిత్య లీడింగ్ లో వుంది. కాంట్రవర్సీతో పాపులారిటీ వస్తుందని తెలీక ప్రియా ఆనంద్ అన్ని ప్రశ్నలకి చప్పటి సమాధానాలిచ్చి కనీసం కవరేజ్ కి కూడా నోచుకోలేకపోయింది. జూ ఎన్టీఆర్ ఎవరో తెలీదని అనుంటే బహుశా నిత్య మీనన్ కి పక్కన పడేసి ప్రియా ఆనంద్ ని ఎక్కువ కవర్ చేసేవారేమో...


Click it and Unblock the Notifications











