ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపితే పరిశీలిస్తా:ప్రియా ఆనంద్
నిజ జీవితంలో మాత్రం ఎవరూ ఇంతవరకు నా గురించి పాడలేదు. అలా పాడాలని ఉన్న వారు ఫేస్‌బుక్‌లో మెసేజ్ పంపితే అప్పుడు పరిశీలిస్తా అంటోంది ప్రియ ఆనంద్. 'లీడర్' చిత్రంతో పరిచయం అయిన ప్రియా ఆనంద్ ప్రస్తుతం జయేంద్ర దర్శకత్వంలో హీరో సిద్ధార్థ్ సరసన '180' చిత్రంతో నటిస్తోంది. ఆ చిత్రంలో ఆమె బర్త్‌డే సందర్భంగా 'నీ మాటలో...' అనే పాటను ప్రేమికుడిగా సిద్ధార్థ్ పాడ్తారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ తననూ ప్రేమించి అలా పాట పాడాలని ఉన్నవారు ఫేస్ బుక్ లో మెసేజ్ పంపితే ఆలోచిస్తాను అంటోంది. అంటే ఆమె ఫేస్ బుక్ ప్రేమను ఏక్సెప్టు చేయటానికి రెడీగా ఉందన్నమాట.ఫేస్ బుక్ ప్రియులు రెడీ అయితే బెస్ట్ ఏమో. అలాగే ఈ సినిమాలో నా పాత్ర గురించి తప్ప మరే విషయాలూ నాకు తెలీవు. కథగా చెప్పాల్సి వస్తే - 'రేపటి గురించి ఆలోచించకు. ఈ క్షణమే నీది' అని చెప్పే సినిమా ఇది అంటోంది.


Click it and Unblock the Notifications











