శ్రీదేవి మృతికి కారణం ఈ హీరోయినే.. మరో నటుడు కూడా.. ఆమెతో నటిస్తే ఇక అంతే!

Recommended Video

Priya Anand Worked With Sridevi, After Then She Is No More Says Troll || Filmibeat Telugu

హీరోయిన్ ప్రియా ఆనంద్ సినీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. రానా దగ్గుబాటి, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వచ్చిన లీడర్ చిత్రంలో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్రియా ఆనంద్ రామ రామ కృష్ణ కృష్ణ, 180 లాంటి చిత్రాల్లో నటించింది. పలు తమిళ చిత్రాల్లో కూడా ప్రియా ఆనంద్ అవకాశాలు అందుకుంది. తెలుగులో ప్రియా ఆనంద్ కు ప్రస్తుతం అవకాశాలు లేవు. తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. సోషల్ మీడియాలో ఓ నెటిజన్ తనని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు ప్రియా ఆనంద్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

సంబంధం లేకపోయినా

సంబంధం లేకపోయినా

దాదాపుగా అందరు సెలెబ్రిటీలు ఏదో ఒక సంధర్భంలో విమర్శలు ఎదుర్కొంటారు. తమ ప్రమేయం లేని కారణాలకు కూడా సోషల్ మీడియాలో సెలెబ్రిటీలపై ట్రోలింగ్ జారుతూ ఉంటుంది. ఇలా ట్రోలింగ్ కు ఎక్కువగా గురయ్యేది హీరోయిన్లే. తాజాగా ప్రియా ఆనంద్ కు కూడా అలాంటి సమస్య ఎదురైంది. తనకు ఏమాత్రం సంబంధం లేని విషయానికి ముడిపెడుతూ విమర్శలు చేసిన ఓ నెటిజన్లకు ప్రియా ఆనంద్ ధీటుగా జవాబిచ్చింది.

శ్రీదేవి మృతికి కారణం

ట్విట్టర్ లో ఓ నెటిజన్ ప్రియా ఆనంద్ గురించి కామెంట్ చేస్తూ.. శ్రీదేవి మృతికి కారణం ప్రియా ఆనందే అన్నట్లుగా పోస్ట్ చేశాడు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో ప్రియా ఆనంద్ నటించింది. శ్రీదేవితో కలసి ప్రియా ఆనంద్ నటించింది.. ఆ తర్వాత శ్రీదేవి మరణించింది. ప్రముఖ నటుడు జేకే రితేష్ తో ఎల్కేజీ చిత్రంలో ప్రియా ఆనంద్ నటించింది. ఇటీవలే ఆయన కూడా మరణించాడు. ప్రియా ఆనంద్ తో ఎవరు నటించినా వాళ్ళు మరణిస్తున్నారు.

ఐరన్ లెగ్

ప్రియా ఆనంద్ బ్యాడ్ లక్ కు సింబల్ గా మారిపోతోంది. ఆమెతో నటించిన వాళ్ళు వరుసగా మరణిస్తున్నారు అంటూ సదరు నెటిజన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ పై ప్రియా ఆనంద్ స్పందిస్తూ.. సాధారణంగా నేను నీ లాంటి వ్యక్తుల గురించి మాట్లాడడానికి ఇష్టపడను. కానీ నువ్వు చాలా సున్నితమైన అంశంపై తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఏ వ్యాఖ్యల వలన మీరు ఎంతగా దిగజారిపోయారో మీకు తెలియాలి. ఇలా మీరు ఎప్పుడూ దిగజారి ప్రవర్తించకూడదనే నేను స్పందిస్తున్నా అంటూ ప్రియా ఆనంద్ ట్వీట్ చేసింది.

నష్టం జరిగిపోయాక

నష్టం జరిగిపోయాక

ప్రియా ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో సదరు వ్యక్తి క్షమాపణ కోరాడు. మిమ్మల్ని బాధించినందుకు క్షమించండి. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయను అని తెలిపాడు. మీ తప్పుని తెలుసుకుని క్షమాపణ కోరినందుకు ధన్యవాదాలు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందుకు ఓ సారి ఆలోచించుకోండి. కొన్ని సార్లు జరగాల్సిన నష్టం జరిగిపోయాక క్షమాపణ తెలిపినా ప్రయోజనం ఉండదు అని ప్రియా ఆనంద్ వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X