Don't Miss!
- News మూడు శుభయోగాలతో ఉగాది ప్రారంభం; మూడు రాశులవారికి అదృష్టం!!
- Sports Mumbai Indians కెప్టెన్సీ మార్పు వెనుక సచిన్.. కొడుకు కోసం రోహిత్‌పై వేటు!
- Lifestyle మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్‌లపై అప్రమత్తం చేస్తుంది!
- Automobiles రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- Finance IPO News: మార్కెట్లోకి రాకేష్ జున్‌జున్‌వాలా ఐపీవో.. డబ్బు రెడీ చేసుకుంటున్న ఇన్వెస్టర్లు..
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కన్నుగీటే సాంగ్ వివాదం: సుప్రీం కోర్టును ఆశ్రయించిన ప్రియా వారియర్
కన్నుగీటే వీడియోతో దేశ వ్యాప్తంగా సంచలనం అయిన మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్ సోమవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ ఆమె పిటీషన్ దాఖలు చేశారు.
ఏమిటీ వివాదం?
‘ఒరు ఆదార్ లవ్'లోని ‘మాణిక్య మలయార పూవి' పాటతో ఒక్కరోజులో ప్రియ వారియస్ పాపులర్ అయ్యారు. అయితే ఈ పాట ముస్లింల మనోభావాలను దెబ్బ తీసేలా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు, మహారాష్ట్రకు చెందిన మరికొందరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రియా వారియర్‌తో పాటు దర్శకుడు ఒమర్ లులుపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
ముందస్తుగా కోర్టును ఆశ్రయించిన ప్రియా వారియర్
ఈ సాంగు వివాదంలో ప్రియా వారియర్, దర్శకుడు ఓమర్ లులుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారులు కంప్లైంట్ చేయడంతో...... ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రియా వారియర్, ఓమర్ లులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
కంటిచూపుతోనే అందరినీ పడేసింది
కంటిచూపుతో ఇండియా మొత్తాన్ని తన వైపుకు తిప్పుకున్న ఇంటర్నెట్ సంచలనం అయింది మలయాళ బ్యూటీ ప్రియా వారియర్. ఆమె చూపులకు మామూలు యువకులు మాత్రమే కాదు... మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
సినిమాకు ఫుల్ పబ్లిసిటీ
ఇంటర్నెట్లో సంచలనం అయిన ప్రియా వారియర్ వీడియో ఆమె నటిస్తున్న ‘ఓరు అడార్ లవ్' చిత్రంలోనిది. ఈ వీడియో పుణ్యమా అని ఈ చిత్రానికి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది.
‘ఓరు అడార్ లవ్' టీజర్ బంపర్ హిట్
‘ఓరు అడార్ లవ్' టీజర్ వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేశారు. ఈ టీజర్ ఇంటర్నెట్లో సంచలనం అయింది. వరకు దీనికి 17 మిలియన్ హిట్స్ వచ్చాయి. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ప్రియుడి పాత్రలో రోషన్ అబ్దుల్ రవూఫ్ టిస్తున్నారు. ఓమర్ లులు దర్శకత్వం వహిస్తున్నారు.