Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రియా వారియర్ గురించి ఈ నిజం తెలిస్తే కంగుతినాల్సిందే..అంతా మారిపోయిందిగా!
Recommended Video
ప్రియా ప్రకాష్ వారియర్..కేవలం ఒక్క వీడియోతో దేశం మొత్తం స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది ఈ భామ. ఇప్పుడు ప్రియా ప్రకాష్ వారియర్ ఇండియాలో బిగ్ సెలెబ్రిటీ. యువత మొత్తం ప్రియా జపం చేస్తోంది. ఓరు ఆదార్ లవ్ చిత్రంలోని ఓ పాటతో ప్రియా ఫేమస్ అయిపోయింది. కుర్ర హృదయాలకు కళ్లెం వేసే విధంగా ఉన్న ఆమె హావభావాలు ఇంటర్ నెట్ లో సెన్సేషన్ గా మారిపోయాయి. ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ బిగ్ స్టార్స్ కన్నా కాస్ట్లీ అయిపోయిందనే వార్త సంచలనంగా మారింది.
దశ, దిశని మార్చేసిన వీడియో
ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని వీడియో ప్రియా ప్రకాష్ వారియర్ జాతకాన్ని మార్చేసింది. ఓవర్ నైట్ లో ఆమె సెలబ్రిటీగా అవతరించింది.
కేసుతో ఇబ్బందులు
ఒరు ఆదార్ లవ్ చిత్రంలోని పాట తమ మనోభావాలని దెబ్బ తీసే విధంగా ఉంది అంటూ కొందరు ప్రియా వారియర్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
సుప్రీంలో నెగ్గుకొచ్చింది
కేసులు, విమర్శలతో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ప్రియా వారియర్ సుప్రీ కోర్టుని ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో ప్రియాకు ఊరట లభించిన సంగతి తెలిసిందే.
స్టార్ సెలెబ్రిటీలు సైతం
ప్రియా పలికించిన హావ భావాలకు దేశవ్యాప్తంగా స్టార్ సెలెబ్రటీలు సైతం ఫిదా అయిపోయారు. దేశం నలువైపులా నుంచి ప్రియపై ప్రశంసలు జల్లులు కురిసాయి.
నిజం తెలిస్తే కంగుతినాల్సిందే
తాజాగా ప్రియా వారియర్ గురించి వస్తున్న వార్తలు షాక్ కి గురిచేస్తున్నాయి. ప్రియా వారియర్ ఎంత పెద్ద సెలెబ్రటీగా మారిపోయిందో ఆమె పారితోషకం కూడా అదే రేంజ్ లో పెరిగిందని అంటున్నారు. ఆఖరికి సోషల్ మీడియాలో ప్రియా పెట్టె పోస్ట్ లకు కూడా రూ 8 లక్షలు రెమ్యునరేషన్ అందుకుంటోందని వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ లకు కూడా దిమ్మ తిరగాల్సిందే
సోషల్ మీడియా పోస్ట్ లకు ప్రియా అందుకుంటున్న ఈ పారితోషకం బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలు అందుకుంటున్న మొత్తానికన్నా ఎక్కువని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్స్ ఏళ్ల తరబడి శ్రమిస్తే దక్కిన క్రేజ్ ఈ భామకు కేవలం కొద్దిరోజుల్లో సొంతం అయిపోయింది.