ప్రియా వారియర్ పచ్చబొట్టు గుట్టు తెలిసిపోయింది.. ఇంత అర్థం దాగుందా, ఆడియో వేడుకలో!
యూట్యూబ్ సంచలనం ప్రియ వారియర్ మరికొద్ది రోజుల్లో తాను నటించిన లవర్స్ డే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియవారియర్ మలయాళీ చిత్రం ఒరు ఆధార్ లవ్ ని తెలుగులో లవర్స్ డే పేరుతో తీసుకురాబోతున్నారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా లవర్స్ డే వేడుక ఘనంగా జరిగింది. ప్రియా వారియర్ ఏం చేసినా సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది. లవర్స్ డే వేడుకలో ప్రియా వారియర్ తన శరీరంపై టాటూతో కనిపించింది. నెటిజన్లంతా ఆ టాటూ గురించి వెతికే పనిలో ఉన్నారు.

ఒక్క వీడియోతో క్రేజ్
గత ఏడాది ప్రియ వారియర్ వెలుగులోకి వచ్చింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని కన్ను గీటిన వీడియోతో ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది. ఆ వీడియోలో ప్రియా వారియర్ హావ భావాలకు యువత పిచ్చెక్కిపోయారు. స్టార్ సెలెబ్రిటీలు సైతం ప్రియా వారియర్ కు ఫిదా అయిపోయారు. ప్రియా వారియర్ కు ఏర్పడిన క్రేజ్ తో ఓరు ఆధార్ లవ్ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు.

వైరల్ అవుతున్న టాటూ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియా వారియర్ టాటూ హాట్ టాపిక్ గా మరింది. ఆడియో వేడుకలో ప్రియా యదపై టాటూ కనిపించింది. ఆ టాటూకు అర్థం ఏంటో తెలుసుకునే పనిలో నెటిజన్లు బిజీగా ఉన్నారు. ప్రియా యదపై 'Carper Diem' అనే పదంతో టాటూ ఉంది. ఈ పదానికి పెద్ద మీనింగే ఉంది. ప్రతి ఒక్కరూ ఈ పదం గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు.

కలలలో ఉండొద్దు
Carper Diem అనేది లాటిన్ పదం. ప్రస్తుతంలో జీవించండి.. కలల లోకంలో విహరించవద్దు. భవిష్యత్తు గురించి చిన్న ఆశతో జీవించండి అనే అర్థం వస్తుంది. దీనిని బట్టి ప్రియ వారియర్ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నారు. ఆమె జీవితంగా గురించి సానుకూలంగా ఆలోచించే స్వభావంతో ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సాధారణంగా యువతీ యువకులు వారికీ ఇష్టమైన వారి పేర్లు కానీ, అభిమానించే వారి పేర్లు కానీ పచ్చ బొట్టుగా వేయించుకుంటారు. కానీ ప్రియా వారియర్ మాత్రం జీవితం గురించి గొప్ప అర్థాన్ని ఇచ్చే పదాన్ని టాటూగా వేసుకుంది.

బన్నీతో సరదాగా
లవర్స్ డే ఆడియో వేడుకలో ప్రియా వారియర్ మాట్లాడుతూ తనకు అల్లు అర్జున్ అంటే ఎంత ఇష్టమో వివరించింది. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో వలె అల్లు అర్జున్ పై రొమాంటిక్ బుల్లెట్ సంధించింది. ఆ దృశ్యాలు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. లవర్స్ డే చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ హీరోగా నటించాడు.


Click it and Unblock the Notifications











