కన్నుగీటి హల్చల్.. ఆ తర్వాత అట్టర్ ప్లాప్.. చివరకు ప్రియా దుస్థితి ఇదా..?
ఒక్క రెండు సెకన్ల కన్నుగీటు తోనే దేశ వ్యాప్తంగా క్రేజీ స్టార్ గా మారింది ప్రియా వారియర్. తమిళంలో ఒరు ఆధార్ లవ్, తెలుగులో లవర్స్ డే పేరుతో వచ్చిన సినిమాలోని ఓ పాటలో ప్రియా కన్నుగీటుకు యూత్ ఆడియన్స్ ఆమె వలలో పడిపోయారు. ముద్దు ఇస్తూ గన్ పేల్చే సన్నివేశంలో ఆమె కన్ను కొట్టడం చూసి అంతా ఇట్టే కనెక్ట్ అయిపోయారు. దీంతో యు ట్యూబ్ సెన్సేషన్‌గా మారడమే గాక రాత్రికి రాత్రే క్రేజీ హీరోయిన్ గా మారింది ప్రియా వారియర్.
దీంతో వెంటనే ఆమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. కానీ లవర్స్ డే సినిమా విడుదలైతే తన క్రేజ్ మరింత పెరుగుతుందేమో అని భావించిన ఆమె ఏ సినిమానూ ఒప్పుకోలేదు. ఆ సమయం లోనే చంద్రశేఖర్ యేలేటి తన కొత్త సినిమాలో ప్రియాను హీరోయిన్ గా తీసుకుందామని ఏకంగా కోటి పారితోషికం మాట్లాడుకుని పాతిక లక్షల అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ లవర్స్ డే విడుదలయ్యాక వచ్చిన క్రేజ్‌ని బట్టి ఇంకా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయొచ్చని కలలు కన్న ప్రియా నో చెప్పేసింది.

ఈ లోగా లవర్స్ డే విడుదల. అప్పటికే ప్రియా కన్నుగీటు పాపులర్ కావడంతో ఈ సినిమాలో ఇంకా కొత్తగా ఏముంటుందని వెతికారు యూత్ ఆడియన్స్. కానీ అవేవీ కనిపించక పోవడంతో మొదటి రోజే ఆ సినిమా డీలా పడటం, ప్రియా క్రేజ్ తగ్గిపోవడం చక చకా జరిగిపోయాయి. దీంతో ఇప్పుడు అదే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఆమెకు కేవలం 30 లక్షల పారితోషికం ఇచ్చి హీరోయిన్ గా తీసుకున్నారట. ఈ అంశం ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ సినిమాలో హీరోగా నితిన్ నటిస్తుండటం విశేషం. చూడాలి మరి ఇక నితిన్‌తో నైనా ప్రియా కలలు నెరవేరునో! లేదో!


Click it and Unblock the Notifications











