ఇంత క్రేజ్ హ్యాండిల్ చేయలేకున్నా.. కేసులు నా వరకు రాలేదు.. ప్రియా వారియర్!

Recommended Video

Priya Prakash Varrier Exclusive Interview With Filmibeat Telugu

ప్రియా ప్రకాష్ వారియర్ లవర్స్ డే చిత్రంతో తెలుగు ఆడియన్స్ ముందుకు కూడా రాబోతోంది. ప్రియా వారియర్ నటించిన ఓరు ఆధార్ లవ్ చిత్రం సౌత్ ఇండియాలోని నాలుగు భాషల్లో విడుదలవుతోంది. కన్నుగీటిన వీడియోతో దేశం మొత్తం ప్రియా వారియర్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ వీడియో వలనే ఒరు ఆధార్ లవ్ చిత్రానికి ఈ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇటీవల ప్రియా వారియర్ లవర్స్ డే ఆడియో వేడుక కోసం హైదరాబాద్ వచ్చింది. చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ సందర్భంగా ఫిల్మీబీట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ప్రియా వారియర్ లవర్స్ డే చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

ఊహించలేదు

ఊహించలేదు

ఒక్క వీడియో వలన ఓవర్ నైట్ లో వచ్చిన క్రేజ్ గురించి ప్రియా వారియర్ మాట్లాడుతూ.. నేనే కాదు.. ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. కన్ను గీటిన వీడియో వలనే ఈక్రేజ్ వచ్చిందని ప్రియా వారియర్ తెలిపింది. లవర్స్ డే చిత్రం స్కూల్ లైఫ్ లో మొదలయ్యే లవ్, రొమాన్స్ అంశాలతో ఉంటుందని ప్రియా వారియర్ తెలిపింది. అంతా కొత్తవాళ్ళం నటిస్తున్నాం. ఈ చిత్ర కథ చాలా ప్రెష్ గా అనిపిస్తుందని ప్రియా వారియర్ తెలిపింది.

క్రేజ్‌ని హ్యాండిల్ చేయలేకున్నా

క్రేజ్‌ని హ్యాండిల్ చేయలేకున్నా

ఈ క్రేజ్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారనే ప్రశ్నకు ప్రియ వారియర్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇంత క్రేజ్ హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకుంటున్నా అని ప్రియా వారియర్ తెలిపింది. ఆ వీడియోతో నాకు దక్కిన గుర్తింపు చూసిన నా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, సన్నిహితులు చాలా సంతోషించారు అని ప్రియా తెలిపింది.

చిన్న సినిమాగా ప్రారంభించాం

చిన్న సినిమాగా ప్రారంభించాం

ఓరు ఆధార్ లవ్ చిత్రాన్ని మొదట తాము చిన్న సినిమాగా ప్రారంభించాం అని ప్రియా వారియర్ తెలిపింది. కానీ ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం విడుదలయ్యే స్థాయికి చేరుకుంది. కొత్తవాళ్ళమైనా మాకు ఇంతకన్నా ఎం కావలి అని ప్రియా వారియర్ తెలిపింది. లవర్స్ డే ఆడియో వేడుకకు అందరికి ఇష్టమైన అల్లు అర్జున్ వచ్చారు. చివర్లో ఆయన నేను చేసిన గన్ షాట్ చేయడంతో చాలా హ్యాపీగా అనిపించింది.

 కేసులు నా వరకు రాలేదు

కేసులు నా వరకు రాలేదు

ఓరు ఆధార్ లవ్ చిత్ర కన్నుగీటిన విడియో వివాదం కావడంపై ప్రియా స్పందించారు. అది అనవసరమైన వివాదం. కేసులేవీ నా వద్దకు రాలేదు. కానీ సుప్రీం కోర్టు సరైన జడ్జిమెంట్ ఇచ్చిందని ప్రియా తెలిపింది. తన తదుపరి చిత్రం శ్రీదేవి బంగ్లా విషయంలో కూడా తాను వ్యక్తిగతంగా ఎలాంటి వివాదలు ఎదుర్కొనలేదని ప్రియా తెలిపింది. లవర్స్ డే చిత్రం విడుదలయ్యాక ఆ చిత్రానికి వచ్చే స్పందన బట్టి భవిష్యత్తు చిత్రాలు ఎంచుకుంటానని ప్రియా వారియర్ తెలిపింది. టాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయని.. కానీ ఒరు ఆధార్ లవ్ తో బిజీగా ఉండడం వలనే ఏ చిత్రాన్ని ఒకే చేయలేదని ప్రియా తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X