twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇద్దరు హీరోయిన్లతో ప్రియా వారియర్, అడ్డంగా బుక్కైంది.. దారుణంగా ట్రోలింగ్!

    |

    ప్రియా ప్రకాష్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటిన వీడియోతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకుంది. ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. దీనితో ప్రియవారియర్ నటించిన ఓరు ఆధార్ లవ్ చిత్రానికి ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం విడుదల కావడం, నిరాశపరచడం జరిగిపోయాయి. ఓరు ఆధార్ లవ్ చిత్రం ప్రియా వారియర్ కు ఎంతటి క్రేజ్ తీసుకుని వచ్చిందో.. అంతే స్థాయిలో విమర్శలని సైతం తెచ్చిపెట్టింది. తాజాగా ప్రియా వారియర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియా వారియర్ ఇంస్టాగ్రామ్లో షేర్ చేసిన ఓ ఫోటోనే ఇందుకు కారణం.

    ఒక్క వీడియోతో క్రేజ్

    ఒక్క వీడియోతో క్రేజ్

    ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో విడుదల కాకముందు వరకు ఆమె ఎవరికీ తెలియదు. ఓ ఋ ఆధార్ లవ్ చిత్రంలోని కన్నుగీటిన వీడియో యూట్యూబ్ లో పెను సంచలనమే సృష్టించింది. ప్రియా ప్రకాష్ వారియర్ హావభావాలకు సెలెబ్రటీలు సైతం ఫిదా అయ్యారు. దీనితో ప్రియా వారియర్ ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ప్రధాన నటిగా మారిపోయింది. కానీ ఆ చిత్రం విజయం సాధించలేదు.

    ఇద్దరు హీరోయిన్లతో

    ఇద్దరు హీరోయిన్లతో

    ప్రియా వారియర్ కు పెరిగిన క్రేజ్ కారణంగా ఆమెకు అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశం వస్తోంది. స్నేహ ఉల్లాల్, కృతిక కమ్రలతో కలసి ప్రియా వారియర్ ఓ వాణిజ్య ప్రకటనలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఓ యాడ్ షూట్ ఫోటోని ప్రియా వారియర్ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. స్నేహా ఉల్లాల్, కృతిక కమ్ర కూర్చులో కుర్చీని ఉండగా ప్రియా వారియర్ మాత్రం నేలపై కూర్చుని ఉంది.

     అడ్డంగా బుక్కైంది

    అడ్డంగా బుక్కైంది

    ఈ ఫొటోకు క్యాప్షన్ గా ప్రియా వారియర్ పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి ప్రియా వారియర్ ఆ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన సందేశాన్ని మాత్రమే పోస్ట్ చేయాలి. కానీ పొరపాటున మొత్తం కాపీ పేస్ట్ చేసి ' ఈ కంటెంట్ ఇంస్టాగ్రామ్, పేస్ బుక్ కొరకు' అనే కామెంట్ కూడా పెట్టింది. ప్రియా వారియర్ కాపీ పేస్ట్ ని నెటిజన్లు వెంటనే పసిగట్టి ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ప్రియా వారియర్ తన తప్పు తాను గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

    దిశా పటాని కూడా

    దిశా పటాని కూడా

    గతంలో హాట్ బ్యూటీ దిశా పటాని కూడా ఇదే సమస్యని ఎదుర్కొంది. వాణిజ్య ప్రకటన కోసం ఓ సందేశాన్ని చూసుకోకుండా పోస్ట్ చేసి విమర్శల పాలైంది. ఇక అనుష్క శర్మ అయితే సామ్ సంగ్ మొబైల్ కు ప్రచారం కల్పిస్తూ ఆపిల్ ఫోన్ ద్వారా ఫోటోలు షేర్ చేసి విమర్శల పాలయ్యారు.

    English summary
    Priya Prakash Varrier's major copy-paste instagram post goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X