For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోల పేర్లు బయటపెడితే అవకాశాలు పోతాయి: ప్రియా వారియర్ సెన్సేషనల్ కామెంట్స్

    |
    Priya Prakash Varrier Shocking Comments On Heroes

    ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. చాలా సినిమాలు ఓకే చేసేసింది కూడా. ప్రస్తుతం చాలా సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బ్యూటీ. తాజాగా హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

    ఒరు ఆదార్ లవ్‌తో మొదలు

    ఒరు ఆదార్ లవ్‌తో మొదలు

    స్కూల్ ఏజ్‌లోనే ప్రేమ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావించింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లో విడుదలైంది.

    ఆ వీడియోలతో ఓవర్ నైట్ స్టార్

    ఆ వీడియోలతో ఓవర్ నైట్ స్టార్

    ఈ సినిమా టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అయింది.

    బాలీవుడ్ అవకాశం

    బాలీవుడ్ అవకాశం

    ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘శ్రీదేవి బంగ్లా' అనే సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ఆమె పేరు శ్రీదేవి అవడం.. అందునా ఆమె నటిగా కనిపించడం.. చివర్లో బాత్ టబ్‌లో మరణించి ఉండడం చూసి ఇది అందాల నటి శ్రీదేవి బయోపిక్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది.

     హీరోల పేర్లు చెప్పను

    హీరోల పేర్లు చెప్పను

    ప్రియ ‘విష్ణు ప్రియ' అనే సినిమాతో కన్నడ చిత్ర సీమలోకి అడుగు పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరు ఏ హీరోతో చేయడానికి ఇష్ట పడతారు అని చాలా మంది అడుగుతున్నారు. నేను సమాధానం చెబుతూనే ఉన్నాను. పలానా హీరోతో చేస్తా అంటే మిగతా హీరోల సినిమాల్లో అవకాశాలు పోతాయి. అందుకే వాళ్ల పేర్లు చెప్పను' అని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    ప్రస్తుతం చేస్తున్న సినిమా

    ప్రియ ప్రస్తుతం బాలీవుడ్, మాలీవుడ్‌లతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా నితిన్‌-చంద్రశేఖర్‌ యేలేటి చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్‌ కొద్దిరోజుల క్రితం నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌ నటిస్తుండగా.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

    English summary
    Internet Sensation, Young Heroine recently Posted a video in Instagram. In This Video She Try To kiss cinematographer Sinu Sidharth. The clip that has gone viral on the internet sees Priya expecting a kiss from Sinu who seemingly had other things on his mind.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X