నా డ్రీమ్ ఈ రోజు నిజమయ్యింది.. చెక్ నాకు బెటర్ లాంచ్: హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ భీష్మ సినిమాతో గత ఏడాది బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సారి చెక్ అనే మరో డిఫరెంట్ సినిమాతో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన చెక్ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆదివారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
వేడుకలో హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ తన స్పీచ్ తో ఆడియెన్స్ మనసును దోచేసుకుంది. ప్రియా ప్రకాష్ వారియర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది నాకు సెకండ్ హోమ్ లాంటిది. ఆడియెన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఈ సినిమా నాకు బెస్ట్ లాంచ్ లాంటిదని చెప్పవచ్చు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. డైరెక్టర్ చంద్రశేఖర్ గారు కూడా చాలా పాజిటివ్ గా ఉంటారు. నితిన్ తో నటించడం కూడా నాకు ఒక మంచి అనుభవం. చాలా మంచి కో స్టార్.

రాజమౌళి, వరుణ్ తేజ్ గారు ఈ వేడుకకు వచ్చి సపోర్ట్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు. చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద స్టార్స్ తో స్టేజ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఆ డ్రీమ్ ఈ రోజు నిజమయ్యింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇక మేము చెక్ సినిమా ద్వారా ఫిబ్రవరి 26న మీ ముందుకు రాబోతున్నాము. తప్పకుండా సినిమా ఆకట్టుకుంటుంది. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.. అని ప్రియా ప్రకాష్ వారియర్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











