Don't Miss!
- News Astrology: రేపటి నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సినిమాటోగ్రాఫర్‌తో ప్రియా ప్రకాశ్ రొమాన్స్.. లిప్ లాక్ ఇవ్వబోతూ బుక్కైపోయింది
Recommended Video
ప్రియా ప్రకాశ్ వారియర్.. ఒకే ఒక్క కన్నుగీటుతో కుర్రాళ్లందరినీ తన వైపునకు తిప్పుకుంది. అలాగే, ఫ్లైయింగ్ కిస్ గన్‌తో ఫిల్మ్ మేకర్లు తన వైపు చూసేలా చేసుకుంది. ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఆమె అందరికీ సుపరిచితురాలు అయిపోయింది. దీంతో అన్ని భాషల్లో ఆమెకు ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే, తాజాగా ఆమె మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి హాట్ టాపిక్ అయింది.
ఒరు ఆదార్ లవ్‌తో మొదలు
స్కూల్ ఏజ్‌లోనే ప్రేమ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళం మూవీ ‘ఒరు అదార్ లవ్'. ఈ సినిమా ద్వారానే ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఈ సినిమా సంపాదించుకున్న బజ్, పాపులారిటీ చూశాక చిత్రబృందం ఈ సినిమాను వివిధ భాషల్లో రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలని భావించింది. అందుకు అనుగుణంగానే తెలుగు సహా కొన్ని భాషల్లో విడుదలైంది.
ఆ వీడియోలతో ఓవర్ నైట్ స్టార్
ఈ సినిమా టీజర్, సాంగ్‌లో కన్నుగీటడం.. గన్‌తో ఫ్లైయింగ్ కిస్ ఇవ్వడం వంటి సీన్లతో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయింది. దీంతో ఆమె దేశ వ్యాప్తంగా సంచలనం అయిపోయింది. దీని తర్వాత నెటిజన్లు ఆమెను వెతకడం.. ఆమె గురించి తెలుసుకోవడం వంటివి చేయడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అయింది.
బాలీవుడ్ అవకాశం
ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రస్తుతం బాలీవుడ్లో ‘శ్రీదేవి బంగ్లా' అనే సినిమాలో నటిస్తోంది. ప్రశాంత్ మాంబుల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో ఆమె పేరు శ్రీదేవి అవడం.. అందునా ఆమె నటిగా కనిపించడం.. చివర్లో బాత్ టబ్‌లో మరణించి ఉండడం చూసి ఇది అందాల నటి శ్రీదేవి బయోపిక్ అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
|
తాజా వీడియోతో మరో సెన్సేషన్
ప్రియా ప్రకాశ్ వారియర్ తాజాగా ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో ఆమెతో పాటు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శీను శ్రీనాథ్ ఉన్నాడు. ఈ వీడియోలో ఇద్దరూ లిప్ కిస్ పెట్టుకునేందుకు ట్రై చేసినట్లు ఉంటుంది. ఇద్దరూ దగ్గరగా వెళ్లిన తర్వాత శీను తన ముఖాన్ని పక్కకు తిప్పి చేతిలో ఉన్న బాటిల్‌తో వాటర్ తాగుతాడు. దీంతో ప్రియ అప్సెట్ అయిపోతుంది. దీనికి ‘మూమెంట్ విత్ మై ఫేవరెట్ శీను శ్రీనాథ్' అని క్యాప్షన్ కూడా పెట్టింది.
విమర్శల వర్షం
ప్రస్తుతం ఈ ఇద్దరు ‘శ్రీదేవి బంగ్లా' సినిమాకు పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హైలైట్ అవడంతో పాటు వివాదాలు కూడా చెలరేగాయి. ఇప్పుడు ప్రియ పోస్ట్ చేసిన వీడియోతో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ వీడియో చూసిన అందరూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
ప్రస్తుతం చేస్తున్న సినిమా
ప్రియ ప్రస్తుతం బాలీవుడ్, మాలీవుడ్లతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా నితిన్-చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో ఆమె హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్రయూనిట్ కొద్దిరోజుల క్రితం నిర్వహించింది. భవ్య క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ నటిస్తుండగా.. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.