twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బీజేపీలోకి సీనియర్ నటి.. వైసీపీ ఎమ్మెల్యే రోజా తనకు పోటీనే కాదంటూ షాకింగ్ కామెంట్స్

    |

    Recommended Video

    Heroine Priya Raman Joins in Bjp Over Comments on Mla Roja || Filmibeat Telugu

    నిన్న మొన్నటి వరకు సినిమాల్లో నటించిన వారు రాజకీయాల్లో చేరి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేస్తున్నారు. ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో తాము రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది నటులు పలు పార్టీల్లో చేరిపోయారు. తాజాగా మరో సీనియర్ నటి కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు, పలనా పార్టీలో చేరుతానని ప్రకటించిన రోజే వైసీపీ ఎమ్మెల్యే రోజాపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

    బీజేపీలో చేరిన ప్రియారామ‌న్

    బీజేపీలో చేరిన ప్రియారామ‌న్

    ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ.. ఎంతో మందిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే సీనియర్ నటి ప్రియారామ‌న్‌తోనూ సంప్రదింపులు జరిపారు లోకల్ లీడర్లు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యమూర్తిని ఆమె కలిశారు. త్వరలోనే తాను బీజేపీలో చేరబోతున్నట్లు తెలిపారు.

    అందుకే రాజకీయాల్లోకి..

    అందుకే రాజకీయాల్లోకి..

    సత్యమూర్తిని కలిసిన తర్వాత ప్రియారామన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నానో చెప్పారు. ‘‘ప్రస్తుతం నరేంద్ర మోదీ చేస్తున్న పాలన నన్ను ఎంతగానో ఆకర్షించింది. దీనికితోడు సమాజ ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నాను'' అని ఆమె తెలిపారు.

    రోజాపై కామెంట్స్

    రోజాపై కామెంట్స్

    ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై కామెంట్స్ చేశారు ప్రియారామన్. ‘‘ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. బీజేపీ అధిష్టానం ఏం ఆదేశిస్తే.. అది చేస్తా. ఇక, వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజాకు, నాకు మంచి స్నేహం ఉంది. అయితే, స్నేహం వేరు.. రాజకీయాలు వేరు. ఆమె నాకు ఎప్పటికీ శత్రువు కాదు. నాకు పోటీ కూడా కాదు'' అని చెప్పుకొచ్చింది.

    ఎవరీ ప్రియారామన్

    ఎవరీ ప్రియారామన్

    ప్రియారామన్‌ పాల్ఘాట్‌ నాయర్‌ కుటుంబం నుంచి ఇండస్ట్రీకి వచ్చారు. దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు. ఆమె తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీలో 50కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో ‘శుభసంకల్పం', ‘మావూరి మారాజు'తో పాటూ పలు సినిమాల్లో నటించారు. గతేడాది ‘పడి పడి లేచే మనసు' సినిమాలో శర్వానంద్ తల్లి క్యారెక్టర్ చేశారు.

    అన్ని చోట్ల వాడుకోవచ్చనే..

    అన్ని చోట్ల వాడుకోవచ్చనే..

    ప్రియారామన్‌కు దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించడంతో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆమెను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావించిదన్న ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఆమెతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. ఈమెను ఏ రాష్ట్రం నుంచైనా వాడుకోవచ్చ అభిప్రాయంతో బీజేపీ అధిష్ఠానం ఉందని టాక్.

    English summary
    South Indian film actress Priya Raman has expressed her willingness to join the BJP. The actress, who arrived in Tirupati after offering prayers at Samalamma temple in Nagari on Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X