వీడియో: మళ్ళీ చంపేసిందిగా ఈ మలయాళీ పిల్ల.. కురాళ్లు ఫిదా, ఏంటా ఎనర్జీ!
మలయాళీ పిల్ల ప్రియా వారియర్ కుర్రాళ్లకు దేవతగా మారిపోయింది. కేవలం ఒకే ఒక్క వీడియోతో ప్రియా వారియర్ నేషనల్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ప్రియా వారియర్ హావభావాలు, ఆమె నవ్వుకు యువత దాసోహమైపోతున్నారు. ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ప్రియవారియర్ కన్నుగీటిన వీడియో ఇప్పటికి యువతని అలరిస్తోంది. అల్లు అర్జున్, రిషి కపూర్ వంటి పెద్ద సెలెబ్రిటీలు కూడా ప్రియా వారియర్ కు అభిమానులుగా మారిపోయారు. కనుగీటిన వీడియో తరువాత ప్రియా వారియర్ కు సంబందించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతోంది. ఓ ఈవెంట్ లో ప్రియా వారియర్ పాకిస్తానీ సాంగ్ హావ హావకు గళం కలిపిన విధానం, స్టెప్పులేసి తీరు వైరల్ గా మారింది. ఆమె ఎనర్జీకి, ఉత్సాహానికి షాక్ అవ్వాల్సిందే.

కన్ను కొట్టి పడేసింది
ఒరు ఆధార్ లవ్ చిత్రంలో ప్రియా వారియర్ నటిస్తోంది. ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో దేశవ్యాప్తంగా యువతలో అలజడి రేపిన సంగతి తెలిసియందే. ప్రియవారియర్ అద్భుతమైన హావభావాలు పిలికించడంతో ఓవర్ నైట్ లో ఆమె స్టార్ సెలేబ్రిటిగా మారిపోయింది.

సోషల్ మీడియాలో హవా
ప్రస్తుతం ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా ఓ సెన్సేషన్. ఆమెకు అద్భుతమైన సినీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రియా వారియర్ ని మిలియన్ల కొద్దీ అభిమానులు సోషల్ మీడియాలో ఫాలో అవడం మొదలు పెడుతున్నారు.
పాకిస్థానీ పాటకు స్టెప్పులు
ఇటీవల ప్రియా వారియర్ ఓ వివాహ వేడుకకు హాజరయ్యింది. అక్కడ జరుగుతున్న సంగీత్ లో ప్రియా పాల్గొంది. బాగా పాపులర్ అయిన పాకిస్థానీ పాట హావ హావ కు గొంతు కలుపుతూ, స్టెప్పులు వేస్తూ ఆమె ప్రదర్శించిఆ ఉత్సాహం మరో మారు యువతలో క్రేజీగా మారింది.

ఏంటా ఎనర్జీ
ప్రియా వారియర్ ఉత్సాహం, ఎనర్జీ ఆశ్చర్యం కలిగించేలా ఉంది. అక్కడ ఉన్న అందరిలో ప్రియా వారియర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











