»   » వీడియో: మళ్ళీ వైరల్..రెడ్ డ్రెస్ లో ప్రియా వారియర్ చంపేసింది.. అభిమానుల తాకిడి!

వీడియో: మళ్ళీ వైరల్..రెడ్ డ్రెస్ లో ప్రియా వారియర్ చంపేసింది.. అభిమానుల తాకిడి!

Subscribe to Filmibeat Telugu
మళ్ళీ వైరల్..రెడ్ డ్రెస్ లో ప్రియా వారియర్ చంపేసింది..!

ఆమె జస్ట్ అలా కన్ను గీటింది అంతే యావత్ భారతం మొత్తం ప్రియా వారియర్ కు దాసోహమైపోయింది. ఈ మలయాళీ పిల్ల ఓవర్ నైట్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. యువత ప్రియా వారియర్ కను సైగలు కుదేలైపోయారు. ఓరు ఆధార్ లవ్ చిత్రంలోని ఆ వీడియో ఇంటర్ నెట్ లో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. తాజాగా ప్రియా వారియర్ మరో మారు హాట్ టాపిక్ గా మారింది. ఈ మలయాళీ ముద్దు గుమ్మ ఎక్కడ కనిపించినా ఏం చేసినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. ప్రియా తాజాగా ఓ షాపింగ్ మాల్ లో మెరిసింది. దానికి సమ్బదించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

 ప్రియా.. ప్రియా అంటున్న యువత

ప్రియా.. ప్రియా అంటున్న యువత

ఓరు ఆధార్ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ పలికించిన హావ భావాలు, ముఖ కవళికలు దేశంలోని యువతని మొత్తం ఆకర్షించాయి. కేవలం ఒక్క వీడియోతో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. యువత మొత్తం ప్రియా వారియర్ జపం చేయడం మొదలుపెట్టారు.

ఓవర్ నైట్‌లో క్రేజ్

ఓవర్ నైట్‌లో క్రేజ్

ఎంతో కాలం కష్టపడితే కానీ కొందరి హీరోలకు, హీరోయిన్లకు స్టార్ స్టేటస్ దక్కదు.. అలాంటిది కన్ను గీటిన వీడియోతో ప్రియా పాపులర్ స్టార్ గా మారిపోయింది. బడా స్టార్స్ అంతా ప్రియా వారియర్ కు అభిమానులుగా మారిపోయారు.

మరో వీడియో వైరల్

మరో వీడియో వైరల్

ప్రియా వారియర్ కు సంబందించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారుతోంది. ఆ ఒక్క వీడియో తో ప్రియా వారియర్ కు సొతం అయిన క్రేజ్ అలాంటిది. తాజాగా ప్రియా వారియర్ ఓ షాపింగ్ మాల్ లో మెరిసింది. ఆ వీడియో నెటిజన్లని ఆకట్టుకుంటోంది.

రెడ్ డ్రెస్‌లో చంపేసింది

ప్రియా వారియర్ ఓ షాపింగ్ మాల్ లో రెడ్ డ్రెస్ లో మెరిసిన తీరు అభిమానులని ఆకట్టుకుంటోంది. ప్రియా వారియర్ కనిపించగానే ఆమె చుట్టూ అభిమానులు గుమిగూడారు. ప్రియా ఓపిగ్గా వారితో ముచ్చటించింది.

హీరోయిన్‌గా అవకాశాలు

హీరోయిన్‌గా అవకాశాలు

ప్రియా వారియర్ కు హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్ని చిత్ర పరిశ్రమల దర్శక నిర్మాతలు ఆమెని సంప్రదించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రియా వారియర్ క్రేజ్ ని ఉపయోగించుకోవడానికి పలు కార్పొరేట్ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి.

English summary
Priya Varrier visits shopping mall. Her red dress looking video goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X