ఫ్లాఫ్ అంటారా? విమర్శకులపై స్టార్ దర్శకుడు...
''విమర్శకులు తామే గొప్ప సినీ ప్రియులం అనుకొంటారు. వాళ్ల అభిరుచులకు తగ్గట్టుగా ఎవరూ సినిమాలు తీయరు. నాకు సత్యజిత్ రే అంటే ఎంతో అభిమానం. అయితే నేను వ్యాపారపరమైన లెక్కలు వేసుకొనేటప్పుడు మరోలా కథను ఆలోచించి తీస్తాను'' అంటున్నారు ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్. ఆయన తాజా చిత్రం 'దె ధనాధన్'. ఈ హాస్య చిత్రమ్మీద ఆయన ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. అయితే ఫలితం ఆయన్ని ఇబ్బందిపెట్టింది. సినీ విమర్శకులు ఆ చిత్రం నాసిరకంగా ఉందంటూ అభివర్ణించారు. అందుకు తగ్గట్టుగానే వసూళ్లూ అంతంత మాత్రంగానే ఉన్నాయి. 'దె ధనాధన్'పై వచ్చిన రివ్యూల గురించి ప్రియన్ దగ్గర ప్రస్తావిస్తే గయ్..మని లేచారు. ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది కదా అంటే ''పాకిస్థాన్‌లో ఈ సినిమా ఎంతో బాగుంది. అక్కడి ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నార''ని మాత్రమే సమాధానమిచ్చారు. ఇంతకుముందు ఒకసారి ఆయన రివ్యూ రైటర్స్ ని మెచ్చుకుంటూ తన సినమాలను సగం వారే ప్రమోట్ చేస్తారని ఎత్తేసాడు. అయితే ఈ సారి ఫలితం రివర్స్ లో ఉండటంతో కామెంట్స్ కూడా అదే దారిలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయన త్రిష, అక్షయ్ కుమార్ కాంబినేషన్లో కట్టా-మీటా అనే కామిడీ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











