twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరుసగా 10 సినిమాలే!

    By Staff
    |

    ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వరుసగా 10 హిందీ సినిమాలకు దర్శకత్వం వహించనున్నాడు. ఇన్ని సినిమాలకు నిర్మాత ఒకరే కావడం మరో విశేషం. ఈ సినిమాలను 6 సంవత్సరాలలో ప్రియదర్శన్ పూర్తి చేయాల్సిఉంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం పూర్తయింది. దక్షిణ భారతానికి చెందిన ప్రియదర్శన్ హిందీలో కూడా విజయవంతమైన దర్శకుడిగా పేరుగడించాడు. ప్రముఖ హీరోలు కాకుండా మామూలు హీరోలతో సినిమాలు నిర్మించే ప్రియదర్శన్ బాక్సాఫీస్ వద్ద మాత్రం ముందంజలో ఉంటారు. సల్మాన్, షారూక్ ఖాన్ లు సైతం ప్రియదర్శన్ సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపినా ఆయన మాత్రం తన స్టైల్ లోనే సినిమాలు తీస్తుంటారు. తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందిన బూల్ బులయ్యా చక్కగా ఆడుతోంది. చంద్రముఖి సినిమా రీమేక్ అయిన బూల్ బులయ్యా బ్రిటన్ లో టాప్ టెన్ లో ఆడుతోంది. ప్రియ దర్శన్ సత్తా తెలిసిన ఒక కార్పోరేట్ కంపెనీ ఆయనతో వరుసగా 10 సినిమాలు నిర్మించడానికి ఒప్పందం చేసుకొంది. ఈ సందర్భంగా ప్రియదర్శన్ మాట్లాడుతూ...అవును ఇది నిజం. ఈ మధ్యే ఒప్పుకున్నాను..ఇపుడే సంస్థ పేరు చెప్పను..తరువాత చెబుతాను..6 సంవత్సరాలలో ఈ సినిమాలను పూర్తి చేయాలి.. సాధారణంగా హిందీలో దర్శకులు సంవత్సరానికి ఒక సినిమా చొప్పున తీస్తారు. నేను మాత్రం నాలుగు తీయగలను. పని మీద శ్రద్ధ పెడితే నాకన్నా ఎక్కువ తీయవచ్చు. బాలీవుడ్ లో ఇన్నాళ్లు సినిమాలు తీయగలుగుతున్నానంటే శ్రద్ధగా తీయబట్టే. లేకపోతే ఎపుడో నన్ను బయటకు తోసేవారే. దక్షిణభారతం నుంచి వచ్చిన దర్శకులను బాలీవుడ్ కు దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాళ్లు అలా చేయడమే నన్ను మరిన్ని హిందీ సినిమాలు తీసేలా పురికొల్పుతుంది...అన్నాడు ప్రియదర్శన్.

    Read more about: priyadarshan telugu movies
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X