twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పి.వాసు ని తప్పు పట్టిన ప్రియదర్శన్

    By Staff
    |

    Priyadarshan
    'కథానాయకుడు' సినిమా ఫ్లాప్ అవటం పి.వాసుని పూర్తి స్ధాయి విమర్శలకు గురిచేస్తోంది. ఆ చిత్రం మళయాళ సూపర్ హిట్ 'కథా పరియంబోల్' రీమేక్ వెర్షన్ అని తెలిసిందే. ఇప్పడదే సబ్జెక్టుతో మళయాళ మాత్రికుడుగా పేరుపడ్డ ప్రియదర్శన్ హిందీలో 'భిల్లో భార్బర్' పేరుతో చిత్రాన్ని రుపొందిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన పి.వాసు కథలోని సోల్ ని పట్టుకోకుండా ఎంతసేపు రజనీకాంత్ ని ఎలా చూపెట్టాలి అన్న అంశం మీదే కాన్సర్ టేట్ చేసారని అందుకే నెగిటివ్ ఫలితాన్ని ఇచ్చిందంటున్నారు.

    మళయాళ ఒరిజనల్ లో ఉన్న ఫీల్ ని క్యారీ చేయలేదని..సినిమా హీరో భార్బర్ పాత్ర అయితే సూపర్ స్టార్ కథగా పి.వాసు కమర్షియల్ ఎలిమెంటస్ అంటూ పూర్తిగా మార్చేసాడని విమర్శిస్తున్నారు. అసలు ఎందుకీ రుసరుసలు అంటే ఇప్పుడీ పరాజయ ప్రభావం అక్కడ తన సినిమా మార్కెట్ పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇలా విమర్శలు చేస్తే పి.వాసు దే తప్పు కానీ కథ మంచిదే ప్రియదర్శన్ బాగా తీసుంటాడని బయ్యర్లు,డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చి సినిమా తీసుకుంటారని ఆయన ఆలోచనట.

    అంతవరకూ బాగానే ఉంది కానీ ఈ సినిమా అక్కడ కూడా సేమ్ ఫలితాన్ని ఇస్తే అప్పుడు పరిస్ధితి ఏంటని అంతా అంటున్నారు. ఇక భిల్లో భార్బర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ హిందీ వెర్షన్ లో షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ రోల్ ని చేస్తూండగా ఇర్ఫాన్ ఖాన్ క్షురకుడు పాత్రను పోషిస్తున్నాడు. దీపావళికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X