చిరుకు ఏకలవ్య శిష్యుడిలా.. కమెడియన్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి ఎందరిలోనో స్ఫూర్తి నింపాడు. సంకల్పం గట్టిదైతే.. ఎంతటి కార్యాన్ని అయినా సాధించవచ్చని నిరూపించాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. మెగాస్టార్‌గా ఎదిగిన ఆ తీరు ఎందరికో మార్గనిర్దేశకం అయింది. చిరంజీవిను స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది హీరోలు, నటీనటులు, దర్శకులు ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు.

చిరంజీవే తమ స్ఫూర్తి అని, ఆయనే తమకు అభిమాన నటుడని ఎంతో మంది సెలెబ్రిటీలు నిర్మొహమాటంగా చెబుతారు. తాజాగా కమెడియన్, నటుడు, హీరో ప్రియదర్శి చిరంజీవిపై ఎమోషనల్‌గా స్పందించాడు.

షార్ట్ ఫిలిమ్స్‌తో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రియదర్శిలోని కామెడీ టైమింగ్‌కు అంతా ఫిదా అయ్యారు. ఆపై పలు సినిమాల్లో కమెడియన్‌గా, హీరో ఫ్రెండ్ పాత్రల్లో నటించాడు.

Priyadarshe About Chiranjeevi In Loser Web Series

మల్లేశం సినిమాలో హీరోగా నటించి.. అందర్నీ మెప్పించాడు. తాను కేవలం నవ్వించడమే కాదు.. ఏడిపించగలనని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న ప్రియదర్శి చిరంజీవి గురించి చెప్పుకొచ్చాడు.

తాను నటిస్తున్న లూసర్ అనే వెబ్ సిరీస్‌లోని ఓ పోస్టర్‌ను షేర్ చేస్తూ.. 'అన్నయ్య చిరంజీవి గారికి, గురుభ్యోనమః ఇది పోలిక కనే కాదు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటూ మీ బాటలో నడిచి ఎంతో స్ఫూర్తిని పొందాను. నటనలో ఆవిష్కరించిన ఎన్నో కొత్త విధానాలు నాపై ఎంత ప్రభావాన్ని చుపించాయో మాటల్లో చెప్పడం సాధ్యం కాదు, అందుకే నేడు మీ ఏకలవ్య శిష్యుడిగా ఈ #Loser మీకు అంకితం' అని చెప్పుకొచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X