Just In
- 6 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : ఓ రాశి వారు మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు...!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జనాల మధ్యలో నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ గుట్టు విప్పిన ప్రియదర్శి.. వెంటనే కౌంటర్ పడింది!
జాతిరత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న యువ నటుడు నవీన్ పొలిశెట్టి రేంజ్ ఇప్పుడు మాములుగా లేదు. హీరోగా రెండవ సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు అందుకోవడంతో ఈ హీరో రెమ్యునరేషన్ డోస్ కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అమెరికాలో సక్సెస్ టూర్ తో సందడి చేసిన నవీన్, ప్రియదర్శి జనాలకు చాలా దగ్గరగా వెళ్లారు. ఇక ఒక మీటింగ్ ప్రియదర్శి నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ గుట్టు విప్పేశాడు.

కథలు విన్న తరువాతే..
జాతిరత్నాలు హిట్టవ్వడంతో నవీన్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. బడా నిర్మతల ఆఫీస్ ల నుంచి అతనికి ఫోన్ కాల్స్ చాలానే వస్తున్నాయట. కానీ నవీన్ మాత్రం తొందరపడకుండా వీలైనంత వరకు సెట్టయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. కథలు విన్న తరువాతే అగ్రిమెంట్ కు రెడీ అంటున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రొడక్షన్ లో పక్కా..
ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ జాతిరత్నం హీరోకు ఫోన్ చేసి విషెస్ అంధించాడు. ఇక సినిమా హడావుడి ముగిసిన తరువాత స్టోరీ డిస్కషన్ జరపనున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు దర్శకుడికి కూడా తన బెస్ట్ విషెస్ అంధించినట్లు తెలుస్తోంది. నవీన్ అయితే దిల్ రాజు ప్రొడక్షన్ లో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

మహేష్ ప్రొడక్షన్ లో కూడా
మహేష్ బాబు జాతిరత్నాలు సినిమాపై పాజిటివ్ గా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ పని తీరుపై ట్విట్టర్ లో కూడా ప్రశంసలు కురిపించారు. అయితే మహేష్ సొంత బ్యానర్ GMB ప్రొడక్షన్ లో కూడా నవీన్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి.

రెమ్యునరేషన్.. లీక్ చేసిన ప్రియదర్శి
ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి రెమ్యునరేషన్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అమెరికా సక్సెస్ టూర్ ప్రియదర్శి అతని రెమ్యునరేషన్ ఎంత అనే విషయాన్ని లీక్ చేసేశాడు. అతను ఇప్పుడు మూడు కోట్లకు పైగానే అందుకుంటున్నాడు.. అనగానే అందరూ ఆశ్చర్యపోయారు.

మొత్తం ఎంతంటే?
ఇక ప్రియదర్శి అలా అనగానే నవీన్ ఆశ్చర్యపోతూ ఒక కౌంటర్ ఇచ్చేశాడు. ఇంకా రెండు కోట్లు తక్కువ చెబుతావేంటి అంటూ.. మొత్తం 5కోట్లు అన్నట్లుగా ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఇక ప్రస్తుతం ఈ జాతిరత్నం అనుష్క సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ తెరకెక్కించనున్నాడు.