కాకా.. ఇక కాచుకో!.. వెండితెరపై మరో దుమారమే: దుమ్ము రేపుతోన్న రాహుల్ రామకృష్ణ పాట

Recommended Video

'Guvva Gorinka' Song Going Viral In Social Media

స్తబ్ధతను బద్దలు కొట్టేదాకా తెలియదు.. వచ్చిందో తుఫాన్ అని. తెరపై మూస, రొటీన్ కథాంశాలతో విసిగిపోయిన తెలుగు ప్రేక్షకులను అర్జున్ రెడ్డి అనే తుఫాన్ ఈ ఏడాది ఎంతలా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తాజాగా విడుదలైన ఓ పాటను చూస్తుంటే.. 2018లో వెండితెరపై మరో దుమారం రాబోతుందా? అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాలో శివ పాత్రలో ఇరగదీసిన రాహుల్ రామకృష్ణ.. 'సోషల్ మీడియా దుమారమే' అంటూ పాడిన పాట ఇప్పుడు నిజంగానే సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది..

గువ్వ గోరింక.. సాంగ్:

గువ్వ గోరింక.. సాంగ్:

'జ్యోతిలక్ష్మి' ఫేమ్‌ సత్యదేవ్‌ కథానాయకుడిగా ఆకార్‌ మూవీస్‌ పతాకంపై దాము కొసనం, జీవనరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గువ్వ గోరింక'. ఫస్ట్ లుక్, టీజర్ తోనే ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిత్రం.. ఇప్పుడో హుషారైన పాటతో హోరెత్తిస్తోంది.

దుమారం రేపుతోన్న 'పాట':

దుమారం రేపుతోన్న 'పాట':

'దగ్గరవాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాక.. ఇది ఆండ్రాయిడు మజాకా..' గువ్వ గోరింకలో రాహుల్ రామకృష్ణ పాడిన ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫేవరెట్‌గా మారింది. ఆకట్టుకునే లిరిక్స్, అదిరిపోయే బీట్‌తో ఉన్న ఈ సాంగ్.. కొన్నాళ్ల పాటు ప్రతీ ఒక్కరి ఆండ్రాయిడ్‌లో మారుమోగడం ఖాయంగానే కనిపిస్తోంది.

కొత్త ముఖాలు.. టాలెంటెడ్ కుర్రాళ్లు:

కొత్త ముఖాలు.. టాలెంటెడ్ కుర్రాళ్లు:

గువ్వ గోరింకలో తాజాగా విడుదలైన సాంగ్ లో కొత్త ముఖాలు కూడా కనిపిస్తున్నాయి. థియేటర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మణ్ మీసాల, పటాస్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన యాదమ్మ రాజు, అలాగే అజర్ షేక్ లాంటి కొత్త ముఖాలతో దర్శకుడు మోహన బొమ్మిడి ఆన్ స్క్రీన్ ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలి.

రాహుల్-ప్రియదర్శి..:

రాహుల్-ప్రియదర్శి..:

పెళ్లి చూపులు సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ ప్రియదర్శి, అర్జున్ రెడ్డితో గుర్తుండిపోయే పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ.. ఈ ఇద్దరూ సినిమాలో ఉండటంతో తెరపై నవ్వుల బ్లాస్టింగ్ ఖాయమే అనిపిస్తోంది. ప్రస్తుతం గువ్వ గోరింక చిత్రం షూటింగ్ దశలో ఉంది.

మ్యూజిక్.. సురేష్ బొబ్బిలి:

చైతన్య, మధుమిత, ప్రియదర్శి, ప్రభాకర్‌, ఫిష్‌ వెంకట్‌, సత్యప్రియ లాంటి నటులు ఈ సినిమాలో కనిపించనున్నారు. చిత్రానికి మాటలు: బజారా, పాటలు: కందికొండ, కృష్ణకాంత, మిట్టపల్లి సురేందర్‌, సంగీతం: సురేశ్ బొబ్బిలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X