నా జీవితంలో బెస్ట్ సెల్ఫీ ఇదే: ప్రియదర్శి
ప్రియదర్శి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 'పెళ్లి చూపులు' అనే సినిమాలో అద్భుతమైన కామెడీని పండించిన ఈ యంగ్ కమెడియన్.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. దీంతో ప్రియదర్శి బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక, ఈ మధ్య 'మల్లేశం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ప్రియదర్శి నటనకు తెలుగు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. ఈ నేపథ్యంలో అతడు ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు.
తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ యూనియన్ స్థాపించి.. ఇప్పటికి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సినీ దిగ్గజాలంతా ఒకే వేదికపైకి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో సహా పలువరు నేతలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే.. పలువురు సినీ ప్రముఖులకు అవార్డులను బహుమతి చేశారు. దీనికి చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆయన మేకొవర్ సూపర్బ్‌గా ఉంది. ఆరు పదుల వయసులోనూ ఆయన యంగ్ హీరోల కనిపిస్తున్నారు. ఇక, ఇదే వేదికలో చిరంజీవితో ప్రియదర్శి ఓ ఫొటోను దిగాడు. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 'నా జీవితంలో నేను దిగిన బెస్ట్ సెల్ఫీ ఇదే' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, చిరంజీవి నటించిన 'సైరా: నరసింహారెడ్డి' గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











