23న ప్రియదర్శి కల్యాణం.. పెళ్లికూతురు ఎవరంటే.. మ్యారేజ్ కార్డు ఇదిగో
పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన నటుడు, కమెడియన్ ప్రియదర్శి ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఉత్తరాదికి చెందిన రిచాశర్మను ఫిబ్రవరి 23న వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి ఆగ్రాలో జరుగున్నది. వీరి పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రియదర్శి పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.
Recommended Video


ఆగ్రాలో ప్రియదర్శి పెళ్లి
ప్రియదర్శి, రిచా శర్మ వివాహం ఆగ్రా కంటోన్మెంట్‌లోని గ్రాండ్ హోటల్‌లో జరుగనున్నది. 23వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి పెళ్లి హడావిడి ప్రారంభమవుతుంది. పెద్దలు నిర్ణయించిన ముహుర్తం ప్రకారం రాత్రి 7 గంటల ప్రాంతంలో రిచాశర్మ మెడలో ప్రియదర్శి మూడు మూళ్లు వేయనున్నారు.

ట్విట్టర్ ద్వారా వెల్లడి
తన పెళ్లి వార్తను ప్రియదర్శి స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ ద్వారా పంచుకొన్నారు. పెళ్లి అనంతరం ఫిబ్రవరి 26న హైదరాబాద్‌లోని నరేన్ గార్డెన్స్‌లో రిసెప్షన్ భారీగా ఏర్పాటు చేశారు.

పెళ్లికార్డు ఇదే..
శర్మ, పులికొండ ఫ్యామిలీ ఆహ్వానిస్తున్న పెళ్లి కార్డు ఇదే..

ప్రియదర్శి పెళ్లికి ప్రముఖులు
ప్రియదర్శి వివాహ వేడుక, రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు భారీగా హాజరయ్యే అవకాశముంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముందుగానే ప్రియదర్శికి వివాహ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రియదర్శికి సక్సెస్‌ల పలకరింపు
ప్రియదర్శి తాజాగా నటించిన ‘తొలిప్రేమ', ‘అ!' సినిమాలు ఘన విజయం సాధించాయి. ఈ రెండు చిత్రాల్లోని ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం ఆయన చేతిలో అరడజను పైగా సినిమాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











