హోమ్ వర్క్....ప్రియమణి విజయరహస్యం
నటిగా నిలదొక్కుకోవడానికి కావలసినంత హోమ్ వర్క్ చేస్తాను' అంటూ తన మనసులోని భావాలను చెప్పుకొచ్చారు ప్రియమణి. మీలో మీకు నచ్చేది ఏమిటని, మీలో వుండే ప్లస్ పాయింట్స్ ఏమిటని ఆమెని కలిసిన మీడియా అడిగినప్పుడు "నటించే వృత్తిపట్ల నిబద్ధత నాలోని పెద్ద ప్లస్ పాయింట్. ఏ సన్నివేశంలోనైనా పూర్తిగా లీనమై చేస్తాను. కెమెరా ముందుకెళ్తే అంతకు ముందున్న అల్లరి మాయమవుతుంది. నేను నటించిన ప్రతి చిత్రాన్నీ చూస్తాను. అందులో నాకేమైనా లోపాలు కనిపిస్తే మరుసటి సినిమాలో దిద్దుకుంటాను అంది. అలాగే రీసెంట్ గా ఆమె పెద్ద సినిమాలు ఓ మూడు వదులుకుంది. వాటి గురించి చెబుతూ..."ఒకరు ఏక సమయంలో ఎన్ని చోట్ల ఉండగలరు? ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా వున్నాను. కాల్షీట్లు సర్దుబాటు కాకపోతే నేనేం చేయను? వచ్చే అవకాశాల్లో నాకు సరిపోయేవాటిని ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. కొన్ని కొన్ని సార్లు డేట్స్ అడ్జెస్ట్ కాక మంచి అవకాశాలు కూడా మిస్ అవుతున్నాయి. అందుకు నాకు కూడా ఎంతో బాధగా వుంది' అని సమాధానం చెప్తోంది బాధగా. ప్రస్తుతం ప్రియమణి నటించిన రావణ్, గోలీమార్ చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలాగే రక్త చరిత్ర షూటింగ్ జరుపుకుంటోంది.


Click it and Unblock the Notifications











