హీరోలను ప్రక్కన పెట్టడానికే ప్రియమణి?
హీరోయిన్ అనగానే హీరో ప్రక్కన డాన్స్ చేస్తూ..అందాలు ఒలకబోయటం అనేది చాలా కాలంగా వస్తున్న విషయం..ఇప్పుడా పరిస్ధితుల్లో మార్పు వస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ వచ్చి హీరోయిన్స్ ఐడెంటిటీని కాపాతున్నాయంటోంది ప్రియమణి. ఆమె ఈ విషయమై మాట్లాడుతూ... ''దాదాపు తొంభై శాతం చిత్రాల్లో హీరోయిన్స్ పాటల్లో అందాలు ఆరబోస్తూ డ్యాన్స్ చేయడానికే పరిమితం అవుతున్నారు. ప్రేక్షకులు కూడా హీరోయిన్స్ ని అలా చూడటానికే ఇష్టపడుతున్నారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అందాల ఆరబోతతో పాటు కొత్తదనం కూడా కోరుకుంటున్నారు. అందుకే హీరోయిన్ ప్రాధాన్యమున్న చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పింది. సినిమాల్లో హీరోయిన్స్ ప్రాధాన్యం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఇది మంచి పరిణామం అంటోంది ప్రియమణి. జాతీయ స్థాయి ఉత్తమ నటి అనిపించుకున్నాను కాబట్టి నటనకు ఆస్కారం ఉన్న పాత్రల్లోనే నటించాలని నియమాలు పెట్టుకోలేదు అంటోంది. టూ పీస్ దుస్తుల్లో కనిపించడానికి కూడా వెనుకాడలేదని గుర్తు చేస్తోంది. ప్రస్తుతం 'క్షేత్రం' చిత్రంలో చారిత్రక నేపథ్యమున్న పాత్రలో నటిస్తోంది. జగపతి బాబు, ప్రియమణి, 'కిక్" శ్యామ్ ముఖ్యతారలుగా శ్రీ బాలాజీ మూవీ మేకర్స్ పతాకంపై టి.
వేణుగోపాల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'క్షేత్రం". వై.ఎస్‌పతాప్ రెడ్డి సమర్పణలో టి.గోవిందరాజు నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'చారిత్రాత్మక నేపథ్యంలో కొనసాగే ఈ చిత్రం నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా వుంటుంది. నాగపెంచలమ్మగా ప్రియమణి, వీరనరసింహారాయలుగా జగపతిబాబు అభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నేటి ట్రెండ్ లో నడిచే ఈ కథ అనుకోకుండా చారిత్రాత్మక నేపథ్యంలోకి మలుపు తిరుగుతుంది. ఇందులో భాగంగా వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చిత్రానికి హైలైట్‌గా వుంటుంది" అని తెలిపారు. అంటే ఈ సినిమా లో ప్రియమణి నాగపెంచలమ్మగా అరుంధతి రేంజ్ లో అదరగొడుతుందని సమాచారం. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, ఆదిత్యమీనన్, రాజీవ్ కనకాల, ఉత్తేజ్, అక్కినపల్లి రాజ్‌కుమార్, బ్రహ్మాజీ, అన్నపూర్ణమ్మ, హేమ, శివపార్వతి తదితరులు ముఖ్యపావూతల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











