తరుణ్‌తో ప్రేమాయణం.. కాస్ట్‌లీ కారు గిఫ్ట్.. అసలు విషయం చెప్పిన ప్రియమణి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో హీరో తరుణ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా అమ్మాయిల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. అయితే తరుణ్ వ్యక్తిగత జీవితంపై మీడియాలో ఎన్నో వార్తలు వచ్చాయి. ఆర్తి అగర్వాల్‌తో రప్రేమాయణం నడిపినట్టు పుకార్లు వచ్చాయి. ఆ తరువాత ప్రియమణితో ఏకంగా పెళ్లి ఫిక్స్ అయిందనే వార్తలు కూడా వచ్చాయి. తరుణ్ ప్రియమణి వెనుకున్న అసలు విషయమేంటో తాజాగా బయటకు వచ్చింది.

 అలాంటి రూమర్లు..

అలాంటి రూమర్లు..

‘నవవసంతం' సినిమాలో హీరోయిన్ ప్రియమణితో కలిసి తరుణ్ పనిచేశాడు. అప్పట్లో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారిందని ప్రచారం జరిగింది. వారిద్దరి పెళ్లి చేసుకుంటారనే వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రియమణి వాటిపై ఓ క్లారిటీ ఇచ్చింది.

ఆ సినిమా సమయంలో..

ఆ సినిమా సమయంలో..

ప్రవరాఖ్యుడు సినిమా షూటింగ్ సమయంలో నేను బిజీగా ఉన్నాను. అప్పుడు ఓ రూమర్ నా వద్దకు వచ్చింది. తరుణ్ వాళ్ల మా ప్రేమను అంగీకరించిదని, పెళ్లికు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. తరుణ్ నాకు ఓ కాస్ట్లీ కారును గిఫ్ట్‌గా ఇచ్చాడని ఇలా రూమర్లు వచ్చాయి అని నాటి సంగతులను ప్రియమణి గుర్తుకు చేసుకుంది.

 మీడియాలో ఫైర్..

మీడియాలో ఫైర్..

ఇదే విషయాన్ని నాకు తమిళనాడు నుంచి ఓ జర్నిలిస్ట్ ఫోన్ చేసి చెప్పాడు. మీ మీద ఓ రూమర్ వస్తోంది.. తరుణ్‌తో ప్రేమ పెళ్లి అని వార్తలు వస్తున్నాయి. మీరు దీనిపై మాట్లాడి మీ వర్షెన్ వినిపిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు నేను మీడియాతో అవి రాసిన జర్నలిస్ట్‌పై ఘోరంగా అరిచేశాను అని ప్రియమణి పేర్కొంది.

అప్పటి నుంచి..

అప్పటి నుంచి..

మా నాన్నకు కూడా అదే విషయాన్ని చెప్పాను. నా మీద ఇలాంటి రూమర్లు రాశారు.. మీడియాతో కూడా మాట్లాడాను అని చెప్పాను. అలా ఎందుకు చేశావ్.. అలాంటి వాటిపై మనం మాట్లాడితే ఇంకా ఏదో ఉందని అనుకుంటారు.. ఏం మాట్లాడుకుండా అలా వదిలేస్తే అసలు ఎలాంటి సమస్య రాదు.. రెండు మూడు రోజుల్లో ఎలాంటి రూమర్ అయినా కనబడకుండా పోతుందని మా నాన్న అన్నాడు. అది కూడా నిజమే అనుకుని అప్పటి నుంచి రూమర్లపై రియాక్ట్ అవ్వడం మానేశాను అని ప్రియమణి చెప్పింది.

Recommended Video

Naarappa Movie Intresting Update | Victory Venkatesh | Priyamani
పెళ్లి తరువాత..

పెళ్లి తరువాత..

కాగా మూడేళ్ల క్రితం ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రియమణి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ముస్తఫా రాజ్ ఢీ షోలో ప్రియమణితో కలిసి ఆ మధ్య రచ్చ చేశాడు. పెళ్లి చేసుకున్నాకే ప్రియమణి మరింత బిజీగా అయింది. వరుసగా ప్రాజెక్ట్‌లతో హల్చల్ చేస్తోంది. ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్‌తో ప్రియమణి అందర్నీ ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X