ప్రియమణితో సచిన్ వెధవ్వేషాలు - కాపాడిన శ్రీశాంత్

By Bojja Kumar

సిసిఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా హీరోయిన్ ప్రియమణితో సచిన్ వెధవ వేషాలు వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. సచిన్ అంటే కొంపతీసి మాస్టర్ బ్లాస్టర్ అనుకునేరు. ఇతగాడు సినిమా యాక్టర్ సచిన్ జోషి. ఆ మధ్య తెలుగులో మౌనమేలనోయి, పండు సినిమాల్లో హీరోగా నటించాడు.

వివరాల్లోకి వెళితే...సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఇటీవల కేరళ స్ట్రైకర్స్-ముంబై హీరోస్ మధ్య కేరళలో టి-20 మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా సచిన్ జోషి ప్రియమణితో మిస్ బిహేవ్ చేశాడు. ఆమెను బలవంతంగా కౌగిలించుకోవడానికి, ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సచిన్ జోషి ప్రవర్తనతో ప్రిమయణి ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి అతడి బారి నుంచి ప్రియమణిని కాపాడట. ఈ విషయాలను హీరోయిన్ ప్రియమణి స్వయంగా వెల్లడించింది. కాగా..ఈ మ్యాచ్ లో కేరళ టీం ముంబై హీరోస్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

తెలుగులో చివరి సారిగా గత సంవత్సరం 'క్షేత్రం' సినిమాలో నటించిన ప్రియమణికి ఈ యేడు ఇప్పటి వరకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. బాబురావు నిన్నొదల అనే ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళంలోనూ ప్రస్తుతం ప్రియమణి పరిస్థితి అంతే. అయితే కన్నడలో రెండు, మలయాళంలో ఓ సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X