రివర్స్ గేర్ లో ప్రియమణి,మమతా?

By Staff

Priyamani
గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వరసగా సినిమాలు చేస్తూన్న ప్రియమణి,మమతా మోహన్ దాస్ లు ఇప్పుడు రూటు మార్చారు. అయ్యప్ప చుట్టూ తిరిగే కథతో రెడీ అవుతున్న ఓ ఆధ్మాత్మిక చిత్రంలో వీరు కనిపించటానికి కమిట్ అయ్యారు. అయితే ఆ రెమ్యునేషన్ ని కూడా ఓ ఛారటిబుల్ ట్రస్ట్ కి డొనేట్ చెయ్యనున్నారుట. ఆ సినిమా పేరు శబరిమలై శ్రీ అయ్యప్ప. అనాశ్వర ఛారెట్ బుల్ ట్రస్ట్ వారు శశి మోహన్ అనే మళయాళ దర్శకుడితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆంధ్రుడైన మాస్టర్ కౌశిక్ బాబు ఈ చిత్రంలో అయ్యప్పగా దర్శనమివ్వనున్నాడు. ఇక ఈ చిత్రంలో ప్రియమణి,మమతాలు ఇద్దరూ దేవతలుగా ప్రాధాన్యత ఉన్న పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ పాత్రలు కోసం పేరున్న మరికొంత మంది హీరోయిన్స్ ని సంప్రదించారుట. అయితే అందరూ డేట్స్ ఖాళీ లేవని నైస్ గా చెప్పి తప్పించుకున్నారుట. కానీ ప్రియమణి మాత్రం తనకీ అవకాశం రావటం చాలా అదృష్టమని చెప్పి కమిటయ్యిందని తెలుస్తోంది.

ఇప్పడున్న స్ధితికి (నేషనల్ అవార్డు రావటం,మణిరత్నం సినిమాలో ఆఫర్ )భగవంతుడే కారణమని ఆమె చెప్పి అవసరమైతే మిగతా కమర్షియల్ సినిమాలు ప్రక్కన పెట్టి అయినా సినిమా పూర్తి చేస్తానందిట. మమతా మాత్రం క్యాజువల్ గా ఈ చిత్రాన్ని ఒప్పుకుని పూర్తి చేస్తానని చెప్పిందిట. ఇక దేముడు చిత్రమైనా పెద్ద హీరోయిన్స్ ఉంటేనే పబ్లిసిటీ కాబట్టి తప్పదనేది దర్శక,నిర్మాతల వాదట.అయ్యప్ప జీవిత విశేషాలతో రూపొందే ఈ సినిమా పీరియడ్ ఫిల్మ్ కావటంతో సెట్స్ కి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రస్తుతం ఆ పనిలో ఉన్నారు దర్శక,నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X