ప్రియమణి! ఆంటీ అంటూ గుసగుసలు!
హీరోయిన్ ప్రియమణి అప్పుడే ఆంటీ అయిపోయిందట! హీరో జగపతి బాబుతో కలిసి ఆమె నటించిన క్షేత్రం సినిమా ఆడియో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఆడియో వేడుకల సందర్భంగా ప్రియమణిని చూసిన వారు ఆంటీలా కనిపిస్తోందని గుసగుసలాడుకున్నారట. ఈ గుసగుసలు కాస్త ప్రియమణి వరకూ వెళ్లడంతో ఆమె చాలా బాధ పడిపోయిందట. తన బరువు తగ్గించుకోవడానికి అప్పుడే కసరత్తు కూడా ప్రారంభించిందట. అయితే ఆమె బరువు పెరగడానికి కూడా కారణం ఉందట. ఈ సినిమాలో ఆమెది ఫర్మార్మెన్స్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రనట.
దానికనుగుణంగా ఆమె తన శరీర సౌష్టవాన్ని కాస్త పెంచిందట. ఇదే విషయాన్ని ఆమె తనను అడిగిన వారికి చెబుతోందట. జగపతి బాబుతో ప్రియమణికి ఇది నాలుగో సినిమా. జగపతి బాబుతోనే పెళ్లైన కొత్తలో... చిత్రంతో తెరంగేట్రం చేసిన ప్రియమణి ఆ తర్వాత టాప్ హీరోయిన్‌గా ఎదిగి పోయింది. పెళ్లైన కొత్తలో చిత్రంలో ఆమె గ్రామర్‌తో పాటు ఫెర్మార్మెన్స్ కూడా ఉన్న పాత్ర. మళ్లీ చాలా రోజుల తర్వాత ప్రియమణి ఫెర్మార్మెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుందనే చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











