వయస్సులో ఉన్నా తప్పేంటి? ప్రియమణి
ద్రోణ చిత్రంలో ప్రియమణి బికినీ వేసినందుకు ఇప్పటికీ రాధ్దాంతం జరుగుతూనే ఉంది. నా బికీనీ, నా అందం..నా ఇష్టం అని ఆమె పదే పదే చెప్తున్నా మీడియా ఆమెను ప్రశ్నిస్తూనే ఉమంది. దానికి కారణం ఆమె పరుత్తి వీరన్ చిత్రానికి జాతీయ అవార్డు సంపాదించటమే. అదే గుర్తుచేస్తూ జాతీయ అవార్డు తెచ్చుకున్నావు కదా ఇంకా ఈ అందాల ప్రదర్శనపై ఆధారపడటమెందుకు అంటున్నారు. దానికి ఆమె రెక్లస్ గా నే సమాధానం చెప్తోంది. "ఏం బికినీ నేనొక్కదాన్నే వేసుకుంటున్నానా? దీనికే ఇలా అనుకుంటే హిందీ సినిమాలు చూస్తే ఇంకేమవుతారో?
అయినా ఏ వయస్సుకా ముచ్చట...బికీనీ వేసుకున్నా..మరోటైనా ఈ వయసులో ధరించకుండా మడిగట్టుకుని కూర్చుని..ముసలిదాన్నయ్యాక ముచ్చటపడితే ఎవరు చూస్తారు? అయినా నేను ఈ కాలం అమ్మాయిని. సినిమాలో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. సందర్భోచితంగా వస్త్రధారణ ఉండటంలో తప్పేమీ లేదన్నది నా అభిప్రాయం" అంటూ కాస్త ఘాటుగా బదులిస్తోంది. ఇక ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న హీరోయిన్స్ లో నమిత తనకి బాగా సన్నిహితురాలని అంటోంది. రాబోయే చిత్రాల్లోనూ తన అందాల ప్రదర్శన కొనసాగుతుందని చెప్తోంది.


Click it and Unblock the Notifications











