ప్రియమణి బికినీ కహానీ
'పెళ్లైన కొత్తలో" హీరో జగపతి బాబు సరసన హీరోయిన్ ప్రియమణి, జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకున్న ప్రియమణి 'ద్రోణ" సినిమా తర్వాత ప్రతి ఇంటర్య్వూలోనూ తాను బికినీ గురించి ప్రశ్నల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోతోంది. బికినీ ప్రియమణికి అస్పలు సూటవలేదని పలువురు అభిప్రాయపడ్తున్నా ఇప్పటికీ నా బికినీ గురించే అందరూ మాట్లాడుకొంటున్నారంటే బికినీలో నేనెంత అదరగొట్టేశానో అర్థమవుతోంది కదా ...అంటూ తన గొప్పలు తానే చెప్పుకుంటోంది. 'ద్రోణ" సినిమాలో బికినీ ధరించి హాట్ హాట్ గా వార్తల్లోకెక్కేద్దామనుకున్న ప్రియమణికి, ఆ చిత్రం మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
అయినా సరే, తన బికినీకి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చిందని చెప్పుకుంటోన్న ప్రియమణి, పద్దతిగా కన్పిస్తే ఎవరు పట్టించుకుంటారు..? అనుకోవడంవల్లే కదా, బికినీ అందాల్ని ఆరబోశావ్...మళ్ళీ ఈ ఎదురు ప్రశ్నలేంటి..? అంటున్నారట. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే బికినీకి తాను సిద్దమేనని, భవిష్యత్ లో మళ్ళీ బికినీ ధరించే విషయమై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సెలవిచ్చింది ప్రియమణి.


Click it and Unblock the Notifications











