నా బికినీ షోనే ముందు

ఇత తమిళ 'బిల్లా' చిత్రంలో నయనతార తొలిసారి బికినీ వేసుకుని బాక్సాఫీస్ ని మాయ చేసింది. నిర్మాతలు రెండు చేతులతోనూ డబ్బులు దండుకుంటే, నయనతార ఒక్కసారిగా కోటి రూపాయల పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయింది. ఆమె వాడిన బికినీ వేలంపాటలో లక్ష రూపాయలకు ఎగరేసుకుపోయారు. దాంతో ఇది గమనించిన హీరోయిన్స్ అంతా బికినీ ప్రదర్శనతో అద్బుతాలు జరుగుతాయనే నిర్ణయానికి వచ్చారు. అది ఎంత స్ధాయికెళ్ళిందంటే...ఈ మధ్య ఓ స్టార్ హీరోయిన్ తాను బికినీలో కన్పిస్తానని పట్టుబట్టింది. అయితే దర్శక, నిర్మాతలు మీ శరీరాన్ని ఎక్సపోజ్ చేస్తే చూడటం కష్టం అని గౌవరంగా చెప్పి బ్రతిమాలి ఆపుచేసారు. సినిమాలో మీ క్యారెక్టరైజేషన్ చాలా గొప్పగా ఉంటుంది.. బికినీ సూటవదు..అని చెప్పుకొచ్చారుట. అలా ఉన్నాయి బికినీ కష్టాలు. ఇక ప్రియమణి బికినీ సీన్ కనుక క్లిక్ అయితే మరికొంత మంది ముధ్దు గుమ్మలు క్యూ కట్టడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications











