నితిన్ ని సేవ్ చేయని బికినీ!!

దర్శకుడు దృష్టి మొత్తం కథ కన్నా..ప్రియమణిని ఎట్లా చూపుదామా, నితిన్ ఫైట్స్ లో ఏమన్నా స్పెషాలిటీ చూపెడదామా అనే వాటిపై ఉండటం మైనస్ అంటున్నారు. ఇక కథలో నితిన్ చిన్నప్పుడే ఓ తప్పు చేసి పోలీస్ కమీషనర్ (ముఖేష్ రుషి)అయిన తండ్రికి భయపడి ఇంట్లోంచి పారిపోతాడు. పెద్దయ్యాక తిరిగివస్తాడు. అయితే అప్పటికే అతను ఓ దొంగగా ఎదుగుతాడు. ఓ సుముహ్తాన్న ఇంటికి వస్తాడు. ఈ స్ధితిలో నేనే మీ కొడుకుని అంటూ తండ్రికి నిజం చెప్పలేక పోతాడు.
అలాగే అతని తల్లి (సీత) గత పది సంవత్సరాలుగా కొడుకుకోసం ఎదురుచూస్తూ ప్రక్కింటి ప్రియమణితో ఏదో రోజు నా కొడుకు తిరిగి వస్తాడని చెప్తూంటుంది. ఇక ప్రియమణి...అతనే...వారి కొడుకని కనిపెట్టినా చెప్పలేకపోతుంది. ఇలా వీరందరి మధ్యా జరిగే మానసిక సంఘర్షణతో కథనం నడుస్తుంది. ఇంతకీ నితిన్ ఇంట్లోంచి ఎందుకు పారిపోయాడూ అంటే అతన్ని విలన్ కిడ్నాప్ చేసాడు కాబట్టి. ఇక ఈ సెంటిమెంట్ కథను ప్రియమణి బికినీ షో బ్రతికించటం కష్టమేనంటున్నారు.


Click it and Unblock the Notifications











