ఫెయిల్ అయినా ప్రియమణికి ఫుల్ ఆపర్స్ రీజన్..
ప్రియమణి నటించిన సినిమాలు వరసగా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంటున్నా మరో ప్రక్క ఫుల్ గా బిజీగా ఉండటం అందరినీ షాక్ కు గురి చేస్తోంది. ద్రోణ నుంచి ప్రవరాఖ్యుడు దాకా అదే వరస ఫ్లాపులు. అయితేనేం ఆమెకు నిర్మాతలకు కొదవ లేదు. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ, కన్నడ సినీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా వెలుగుతోంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను సమ్మోహనపరిచిన ప్రియమణి త్వరలో 'రావణ్' చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటాననే ధీమాతో వున్నారు. ప్రస్తుతం ప్రియమణి తెలుగులో జగపతిబాబు సరసన ఓ చిత్రం, రవితేజతో 'శంభో శివ శంభో' చిత్రంలో నటిస్తున్నారు.దానికి కారణంగా ఆమెను రికమెండ్ చేస్తున్న జగపతిబాబు వంటి హీరోల గురించి చెప్తున్నారు. ఎందుకంటే ప్రవరాఖ్యుడు అనంతరం ఆమె మరోసారి జగపతిబాబు సరసన బుక్కయింది.
అయితే ఈమెకు ఇంత క్రేజ్ రావటానికి కారణం రికమండేషన్స్ మాత్రమే కాదు. ఆమె అందచందాలే ఎటువంటి హావాభావాలైన పలికించగల అభినయం ఆమె సొంతం దర్శక, నిర్మాతలు అంటూంటారు. 'ద్రోణ' చిత్రంలో బికినీలో అందాలు చూపించిన ప్రియమణి, 'పరుత్తివీరన్' అనే తమిళ చిత్రంలో డీ గ్లామర్ పాత్రను పోషించి తన అభినయంతో జాతీయఅవార్డు కూడా సంపాందించుకున్నారు. అందం, అభినయానికి అభినయం ప్రియమణి సొంతం అంటున్నారు. ప్రవరాఖ్యుడు తర్వాత ఆమెను దాదాపు ఐదుగురు నిర్మాతలు కలిసినట్లు తెలుస్తోంది. ముగ్గురు దర్శకులు కధలు విని ఆమె హీరోయిన్ గా ఓకే చెప్పిందని తెలుస్తోంది. మొత్తానికి అందరికీ ప్రియమణి అన్పించుకుంటోంది.


Click it and Unblock the Notifications











