ప్రియమణి బాగా కో-ఆపరేటివ్ అట!
ఆశ్చర్యపోతున్నారా...ఇంకెవరు...ప్రియమణి. సెక్సీ డ్రెస్ వేయడానికి, ఫ్రెండ్లీగా ఉండడానికి వెనకాడని ప్రియమణి త్రిషా స్థానాన్ని ఆక్రమిస్తోంది.కొద్ది రోజుల క్రితమే యమదొంగ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రియమణి మంచి టాలెంట్ ఉన్న నటి అన్నాడు. డాన్స్ లో కొంచెం మెరుగైతే ఆమెకు ఎదురేలేదని అంటున్నాడు. యమదొంగలో తనతోపాటుగా స్టెప్స్ వేయలేక ఇబ్బంది పెట్టిందని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు కూడా. అయినా ఆమె ఎలా చేసినా ప్రేక్షకులు మాత్రం విపరీతంగా ప్రియమణిని అభిమానిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఎమ్ఎస్ రాజుకు ప్రియమణి అంటే చాలా ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నాడు. ప్రియమణిది విశాలహృదయం, చాలా కో-ఆపరేటివ్ గా ఉంటుంది. మిగతా నటీమణులు అలా ఉండరు..అంటున్నాడు. మహేష్ బాబు హీరోగా త్వరలో ప్రారంభం కానున్న సినిమాలోనూ ప్రియమణి ఛాన్స్ కొట్టేసింది. ప్రియమణి స్పీడ్ కు బెదిరిన త్రిషా, నయనతారలు పెద్ద దర్శకులు అలా కదపగానే ఇలా డేట్స్ ఇచ్చేస్తున్నారట.తమిళంలోనూ ప్రియమణి హవా నడుస్తోంది. మలైకొట్టాయ్ (తెలుగులో భయ్యా)సినిమా విజయం సాధించండం విశాల్ దృష్టిలో ప్రియమణి ప్రత్యేక స్థానాన్ని పొందింది. ఈ మధ్య విజయ్ తోనూ అవకాశం దొరికినపుడెల్లా తన సంబంధాలను మెరుగు పరుచుకొనే ప్రయత్నాలు చేస్తోందట.


Click it and Unblock the Notifications











