పూరీ జగన్నాధ్ చివరకు ప్రియమణితో ఫిక్స్
పూరీ జగన్నాథ్ తాజా చిత్రం 'గోలీమార్'లో హీరోయిన్ గా ప్రియమణిని ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. గోపీచంద్ హీరోగా చేసే ఈ చిత్రం కోసం మొదట హీరోయిన్ గా హన్సికను అనుకున్నారు. అయితే ఆమె చెప్పిన రెమ్యునేషన్ విని వద్దనుకున్నారు. ఆ తర్వాత తేజ 'కేక' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఇషానా ఎలా ఉంటుందని చర్చలు జరిగాయి. అయితే అక్కడా అడ్డంకులు ఎదురయ్యాయి. దాంతో చివరకు ప్రియమణి అయితే ఆ పాత్రకు న్యాయం చేస్తుందని భావించారు. అందులోనూ హీరోయిన్ పాత్ర ఈ చిత్రంలో కాస్త మెచ్యుర్డ్ పర్శన్ గా కనపడాలని భావించటం ఓ కారణమని తెలుస్తోంది.
ఇక దయానాయక్ జీవిత చరిత్ర స్ఫూర్తితో రూపొందనున్న గోలీమార్ చిత్రంలో గోపీచంద్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపిస్తారు. అలాగే ఈ చిత్రానికి ఇప్పటివరకూ మిగతా ప్రధాన పాత్రల్లో నాజర్, రోజా ని ఎంపిక చేసారకు. ఈ వారంలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ, విజయ్ పైట్స్, చక్రి సంగీతం అందిస్తున్నారు. అలాగే ప్రియమణి ప్రస్తుతం రవితేజ హీరోగా బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న 'శంభో శివ శంభో' చిత్రంలోనూ, జగపతిబాబు సరసన 'సాధ్యం' చిత్రంలోనూ చేస్తోంది. రెండు వారాల క్రితం ఆమె జగపతిబాబుతో చేసిన ప్రవరాఖ్యుడు చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











