క్రిమినల్ లాయర్‌ను సంప్రదించిన ప్రియమణి!
హీరోయిన్ ప్రియమణి క్రిమినల్ లాయర్ ను సంప్రదించిందనే వార్తలు ఇప్పడు సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అమె ఎవరిని టార్గెట్ చేయడానికి లాయన్ ను సంప్రదించిందో? అని పలువురు సందేహిస్తున్నారు. అయితే ఆమె లాయర్‌ను కలవడానికి కారణం వేరే ఉందని మరో వాదన కూడా వినిపిస్తోంది. క్రిమినల్ లాయర్ లైఫ్ స్టైల్, వారు కేసులను ఎలా డీల్ చేస్తారనే విషయాలు తెలుసుకోవడానికే ప్రియమణి అలా చేసిందని అంటున్నారు.
ప్రియమణి త్వరలో మళయాలంలో ఓ సినిమా చేయబోతోంది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పేరు 'గ్రాండ్ మాస్టర్'. ప్రియమణి ఇందులో క్రిమినల్ లాయర్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే క్రిమినల్ లాయర్ ను సంప్రదించిందట.
ప్రస్తుతం తెలుగులో ప్రియమణికి పెద్దగా అవకాశాలే లేవు. 'బాబూ రావు నిన్నొదల' అనే చిత్రంలో మాత్రమే నటిస్తోంది. దీంతో అవకాశాల కోసం కన్నడ, మళయాళం సినిమాలపై దృష్టి సారించింది ఈ అమ్మడు.


Click it and Unblock the Notifications











