ప్రియమణి కఠోర స్వరం
ప్రియమణి తిరకాతా చిత్రానికిగాను కేరళ స్టేట్ అవార్డు బెస్ట్ యాక్టర్ గా దక్కించుకోలేక పోయారు. ఈ అవార్డును ప్రియాంక దక్కించుకొన్నారు. కారణం తను నటించిన సినిమాలో ఆమె సొంతంగా మాట్లాడలేదన్నారు. ప్రియమణి మాట్లాడుతూ తన సినిమాలలో తన వాయిస్ తోనే మాట్లాడాలని వున్నా అది దర్శకుల వరకే పరిమితమైనది. తిరకాతా డబ్బింగ్ సమయంలో తాను చాల బిజీగా వున్నాని ఆ సినిమా యునిట్ సభ్యులు తను డబ్బింగ్ పూర్తి చేయడానికి ఆగలేదని చెప్పారు. ఈ అవార్డు రానందుకు తాను బాధ పడలేదని చెప్పారు. ఈ అవార్డును తన అమాయకత్వంతో దక్కించుకోలేకపోయానని తెలియజేశారు. తెలుగులో ఇంత వరకు డబ్బింగ్ చేయలేదని, కన్నడలో తన మెదటి సినిమా 'రామ్" పునిత్ రాజ్ కుమార్ సరసన నటించినా ఇందులో కూడ తను డబ్బింగ్ చేయలేదని చెప్పారు. చాలా మంది దర్శకులు తన వాయిస్ డబ్బింగ్ కు సూట్ కాదని, ఆమె వాయిస్ ఎక్కువ వాల్యూమ్ తో ఉంటుందంటారు ఐతే చాలా మంది హిందీ నటీమనులు ఉదాహరణకు రాణి ముఖర్జి నా వాయిస్ లాగే వుంటుందని వారు నటించే సినిమాలలో తమ స్వంత వాయిస్ నే ఉపయోగిస్తారు, అది దర్శకుల మీదే ఆధారపడి వుంటుందని వాపోయారు.


Click it and Unblock the Notifications











