ప్రియమణి కదే తొలి అనుభవమట!
ప్రియమణి ఏం మాట్లాడినా చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతుంది. మనసులో మాట ఉన్నదున్నట్టు బయటపెడుతుంది. ఇటీవల గోవాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సానికి వెళ్లినపుడు జరిగిన విషయాలను ఎంచక్కా చెప్పింది. దక్షిణాది నుంచి ప్రియమణికి ఆహ్వానం అందగా, ఉత్తరాది నుంచి బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ వచ్చారు. డయాస్ ఎక్కగానే ప్రియమణిని షారూక్ ఖాన్ ఒక విషయం అడిగాడట. అదేమంటే...డయాస్ మీదకు రాగానే భయం వేస్తోంది మరి మీకో అని ప్రియమణిని అడిగాడట. అంతటి పెద్ద నటుడు అలా అనేసరికి మతిపోయిన ప్రియమణి ఇలా స్పందించింది...నా కిదే తొలి అనుభవం కాబట్టి భయం వేస్తోంది..మీరు ఇంతకుముందు చాలామార్లు ఇక్కడికి వచ్చారు కదా...అని అందిట. అయినా భయమేస్తోందని షారూక్ బదులిచ్చాడట. ఇకపోతే షారూక్ తో నటించాలని ఉందని కూడా ప్రియమణి చెబుతోంది. ఆమె కోరిక తీరాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











