ప్రియమణి భయంకరంగా, ఇంకా వాడుకుంటున్నారు..ఇరికించేసిందిగా!
Recommended Video

వివాహం అనంతరం ప్రియమణి సినిమాలకు దూరంగా ఉంటోంది.ఇటీవల కాలంలో ప్రియమణి తెలుగులో ఎంటువంటి సినిమా చేయలేదు. గతంలో ఈ సెక్సీ హీరోయిన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగేది. ప్రియమణి కెరీర్ లో ఘనవిజయం సాధించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ప్రియమణి సోలో హీరోయిన్ గా కూడా కొన్ని చిత్రాల్లో మెరిసింది. కాగా ప్రియమణి తాజాగా మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు నమోదు చేసిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రియమణి ఎందుకు ఫిర్యాదు చేసిందని అంతా ఆరా తీస్తున్నారు.

తొలి చిత్రం అదే
ప్రియమణి ఉల్లం అనే తమిళ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఎవరి అతగాడు చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయం అయ్యింది.

పెళ్ళైన కొత్తలో
ఆ తరువాత తెలుగులో ప్రియమణి నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రంలో యువత గుండెల్లో సెగలు పుట్టించింది. ఈ చిత్రంలో చీరకట్టులో కనిపించినా జగపతి బాబుతో చేసిన రొమాన్స్ కు యువత ఫిదా అయ్యారు. ఈ చిత్రం ద్వారా ప్రియమణి పేరు టాలీవడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

వరుస హిట్లు
దీనితో ప్రియమణికి తెలుగులో ఆఫర్లు వెల్లువెత్తాయి. రాజమౌళి దర్శత్వంలో యమదొంగ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. యమదొంగ చిత్రం సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కళ్యాణ్ రామ్ తో చేసిన హరే రామ్ చిత్రం కూడా మంచి విజయం సాధించడంతో సౌత్ లో ప్రియమణి క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.

బికినీతో హాట్ టాపిక్
ప్రియమణి అప్పట్లోనే నితిన్ చిత్రం ద్రోణలో బికినీ ధరించి సంచలనం సృష్టించింది. ప్రియమణి బోల్డ్ డెసిషన్ కు ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురైంది.

సోలో హీరోయిన్ గా కూడా
ప్రియమణి తెలుగు, తమిళ భాషల్లో చారులత వంటి చిత్రాలలో సోలో హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది. ప్రియమణి సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న సమయంలో ఐదేళ్ల క్రితం అంగుళిక అనే చిత్రం చేయడానికి సైన్ చేసింది. ఆ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ చిత్రం ప్రస్తుతం వివాదంగా మారింది.

ప్రియమణి భయంకరంగా
ఈ చిత్రం ప్రారంభమైన సమయంలో ప్రియమణి భయంకరమైన స్టిల్స్ కొన్ని విడుదల చేసారు. హర్రర్ చిత్రంగా ఈ చిత్రం రూపొందింది.

సినిమా నుంచి తప్పుకుంది
కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ప్రియమణి తప్పుకుంది. దీనితో మరో హీరోయిన్ తో ఈ సినిమాని పూర్తి చేసారు. కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రియమణి చిత్రాలే కనిపిస్తున్నాయి.

ఫిర్యాదు చేసిన ప్రియమణి
చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో ఇప్పటికి తన ఇమేజెస్ ని వాడుకుంటున్నారని ప్రియమణి మూవీ ఆర్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనికి తనకు నష్టపరిహారం చెల్లించాలని ప్రియమణి డిమాండ్ చేస్తోంది.

ప్రియమణికి సపోర్ట్
మూవీ ఆర్ట్ అసోసియేషన్ కూడా ప్రియమణికి మద్దత్తు తెలుపుతున్నట్లు తెలుస్తోంది. సినిమా నుంచి ఆమె తప్పుకున్న తరువాత కూడా ప్రియమణి చిత్రాలని ప్రచారానికి వాడుకోవడం సరికాదని 'మా' అభిప్రాయ పడ్డట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











