»   » ప్రియమణికి గ్యాంగ్ రేప్ ఎక్స్‌పీరియన్స్!

ప్రియమణికి గ్యాంగ్ రేప్ ఎక్స్‌పీరియన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గ్యాంగ్ రేప్ జరిగితే ఎంత నరకం ఉంటుందో తనకు తెలుసు అంటోంది హీరోయిన్ ప్రియమణి. కొంపతీసి ఆమెపై ఏదైనా అఘాయిత్యం జరిగిందని మాత్రం ఊహించుకోవద్దు. ఇటీవల ప్రియమణి నటించిన 'చండీ' సినిమాలో ఆమెపై ఓ గ్యాంగ్ రేప్ సీన్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. సినిమా సీన్లో నటించేప్పుడే నరకం కనిపించింది.....నిజంగా అలాంటి ఘటనలు జరిగితే ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోగలను అనే విధంగా మాట్లాడింది ఈ కేరళ బ్యూటీ.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ...తన సినిమా కెరీర్లో ఇప్పటి వరకు అత్యంత కష్టపడి చేసిన సీన్ చండీ సినిమాలోని రేప్ సీనేనట. అదే విధంగా ఈ సినిమాలోని ఇతర సన్నివేశాలు పర్ఫెక్టుగా రావడం కోసం కూడా చాలా కష్టపడిందట. పాపం ప్రియమణి ఇంత కష్టపడ్డప్పటికీ.....బాక్సాఫీసు వద్ద కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదు పాపం.

 Priyamani gang rape experience

ప్రియమణ సినిమాల విషయానికొస్తే.... 'అంగుళీక'అనే మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. మళయాలంలో 'పేయింటింగ్ లైఫ్', కన్నడలో 'అంబరీష' చిత్రాలు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. వీటితో పాటు 'ది ట్రూ స్టోరీ' అనే మరొక మళయాలం చిత్రానికి కూడా ఆమె సైన్ చేసినట్లు సమాచారం.

ఇటీవల విడుదలైన బాలీవుడ్ మూవీ 'చెన్నై ఎక్స్‌ప్రెస్' ప్రత్యేక గీతం చేసిన ప్రియమణికి ఆ పాట హిట్టయినా....పెద్దగా క్రిడెట్ దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమా హిట్ కావడంతో బాలీవుడ్లో ఆమె బిజీ అవుతుందని అనుకున్నారు కానీ....ఒక్క బాలీవుడ్ చాన్స్ కూడా రాక పోవడం ఆమె అభిమానులను నిరాశ పరిచింది.

English summary
Priyamani faced like gang rape experience in her recently released movie Chandi. Priya Vasudev Mani Iyer , widely known as Priyamani, is an Indian film actress and model, who appears mainly in films made in southern India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu