కావాలనే బ్రేక్ ఇచ్చానంటున్న ప్రియమణి
తాను ఓ ప్రముఖ బేనర్‌పై నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు ఆమె తెలిపింది. ప్రతి హీరోయిన్‌కు ఇటువంటి గ్యాప్ వస్తుందని చెప్పింది. తానేదో పెళ్లి చేసుకుంటున్నట్లు ఊహాగానాలు చేయవద్దని ఆమె సలహా ఇచ్చింది. ప్రతి హీరోయిన్‌కు తనకు వచ్చినటువంటి గ్యాప్ రావడం సహజమని ఆమె సమర్థించుకుంది.
జాతీయస్థాయి అవార్డు పొందిన ప్రియమణి కూడా గ్యాప్ తీసుకుంది. అయితే, నిజంగానే ప్రియమణి గ్యాప్ తీసుకుందా, చాన్స్‌లు రావడం లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్లు సినీ పరిశ్రమలో కొద్ది కాలమే తళుక్కుంటారని చెప్పడానికి ప్రయమణి కూడా ఒక ఉదాహరణ కావచ్చునని అంటున్నారు.
చారులత సినిమా ప్రియమణిని ఆలోచనల్లో పడేసినట్లు చెబుతున్నారు. అయితే, ''ఈ సినిమా ఫలితం నన్నేమీ నిరాశకు గురిచేయలేదు. నటిగా నాకెంతో సంతృప్తినిచ్చింది. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలనిపించింది. అయినా ప్రయోగాత్మక చిత్రాల్లో కమర్షియల్ వాల్యూస్ తక్కువగా ఉండటం సహజం. 'చారులత' సినిమా విషయంలో కూడా అదే జరిగింది . అలాగే 'చారులత' చేయకపోతే... నటిగా ఓ గొప్ప పాత్రను మిస్ అయ్యేదాన్ని'' ప్రియమణి ఇటీవల అన్నది.


Click it and Unblock the Notifications












